'నేను ఇండియా టీం కు సపోర్ట్ చేయను'.. ఈ అభిమాని మాటలు వినండి..

హైదరాబాద్ నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో కలకలలాడుతుంది. హైదరాబాద్ టీం తో రాజస్థాన్ రాయల్స్ ఆడబోతుంది. ఇప్పటికే 49 మ్యాచులు పూర్తిచేసుకుని 50వ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. హైదరాబాద్ టీం గత రెండు మ్యాచ్లో వరుసగా ఓడిపోయి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో విజయభేరి మోగించాలనుకుంటుంది.

ఈ మ్యాచ్ ని చూడడానికి హైదరాబాద్ నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్ర క్రికెట్ అభిమానులు కూడా వచ్చారు. అందులో ఎక్కువగా హైదరాబాద్ టీం ని సపోర్ట్ చేయడానికి తరలివచ్చారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ టీం తప్పకుండా 300 పరుగులు చేసి రికార్డు సొంతం చేసుకుంటుందని హైదరాబాద్ టీం అభిమానులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. హైదరాబాద్ టీం డైహాడ్ ఫ్యాన్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ చూడడానికి కోయంబత్తూర్ నుంచి వచ్చాడు. తాను ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చి తనకు ఎంతో ఇష్టమైన ఆరెంజ్ ఆర్మీ హైదరాబాద్ టీం గెలవాలని ఆకాంక్షతో ఉన్నాడు.

అయితే ఈ అభిమాని ఇటీవలే రిలీజ్ అయిన ఇండియా టి20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్షన్ పై ఆగ్రహంగా ఉన్నారు. మొదటిసారిగా టి20 వరల్డ్ కప్ ఇండియా టీం స్క్వాడ్ లో స్థానం సంపాదించిన సంజు సాంసన్ ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా అన్ని మ్యాచ్ల్లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్న రింకు సింగ్ కి స్థానం దొరకనందుకు నిరాశ చెందాడు.

Admissions: గిరిజన గురుకుల పాఠశాలలో.. 3 వ తరగతికి అడ్మిషన్లు ప్రారంభం..

ఈ అభిమానికి ఇండియా టీం అంటే అస్సలు ఇష్టం ఉండదని, కేవలం తాను హైదరాబాద్ టీంకు సపోర్ట్ చేస్తారని తెలిపారు. ఎందుకంటే ఇండియా టీం సెలక్షన్ ఏదో కమర్షియల్ మూవీ, బిజినెస్ లాగా ఉంటుందని, కొత్త టాలెంట్ కి అస్సలు చోటు ఎవరని, ఇంస్టాగ్రామ్ లో ఎవరికీ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వారికి ఐపిఎల్ టీమ్స్ ఎవరికీ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వారికి ఇండియా టీం లో చోటు ఇస్తారని తెలిపారు. ఇండియాలో ఎంతోమందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. రోజు ఆడుతూనే ఉంటారు.

వారిలో ఇండియా టీం లో సెలెక్ట్ అవ్వడానికి అర్హత ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కొత్తవారికి స్థానం ఇస్తే చాలా బాగుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సెలక్షన్ మారాలని, కొత్త క్రికెట్ ప్లేయర్లకు ఇండియా టీం లో చోటు ఇవ్వడం బీసీసీఐ నేర్చుకోవాలని, అంతేకాకుండా హైదరాబాద్ టీం లో ఆడుతున్న అభిషేక్ శర్మ, గుజరాత్ టీం కెప్టెన్ గిల్, కోల్కత్తా టీం లో ఆడుతున్న రింకు సింగ్... ఇలాంటి అదిరిపోయే ప్లేయర్లు చాలామంది ఉన్నారని వీరికి చోటు ఇవ్వాలని.. హైదరాబాద్ టీం డైహాడ్ ఫ్యాన్ రాకేష్ ప్రత్యక్షంగా లోకల్ 18 ప్రతినిధితో తెలిపారు.

2024-05-02T14:00:47Z dg43tfdfdgfd