నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ

నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ

భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. భారత వెటరన్ స్పిన్నర్‌ అమిత్ మిశ్రాతో  పరిహాసమాడాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిశ్రా.. ఇప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో అతని వయస్సును గుర్తుచేస్తూ హిట్ మ్యాన్ మైదానంలో నవ్వులు పంచాడు. అందుకు సంబంధించిన వీడియోను లక్నో యాజమాన్యం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. 

చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్..

లక్నోతో మ్యాచ్ అనంతరం మురళీ కార్తీక్, అమిత్ మిశ్రా, రోహిత్ శర్మ మధ్య సంభాషణ జరిగింది. ఆ సమయంలో మిష్రాజీ మీ వయసెంత..? అని హిట్‌మ్యాన్ ప్రశ్నించగా.. అందుకు మిశ్రా 40 ఏళ్లని తెలిపాడు. ఆ సమాధానంతో భారత కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. నాకు 37 ఏళ్లు అంటే.. మీరు కంటే మూడేళ్లు పెద్దవారు అంతేనా..! నేను నాపీస్‌లో ఉన్నప్పుడు అరంగేట్రం చేశారు.. కాస్త నిజాలు చెప్పండి.." అంటూ రోహిత్ తన ట్రేడ్‌మార్క్ పద్ధతిలో చమత్కరించాడు. నిజానికి అమిత్ మిశ్రా 41 ఏళ్లే. 2003లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన మిశ్రా.. ఇప్పటికీ కొనసాగుతున్నాడు. తనలో శక్తి దాగున్నంతవరకు క్రికెట్‌లో కొనసాగుతానని గతేడాది వెల్లడించాడు.

ఇక లక్నో, ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. నేహాల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35) నెట్టుకురావడంతో.. ముంబై ఆమాత్రం స్కోరైన చేయగలిగింది. అనంతరం 19.2 ఓవర్లలో లక్నో బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని చేధించారు. మార్కస్ స్టోయినిస్ (62) ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T13:12:16Z dg43tfdfdgfd