పవన్ కల్యాణ్ పిలుపు కోసమే నేను ఎదురుచూస్తున్నా.. అనసూయ డేరింగ్ స్టేట్ మెంట్

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ షిప్ట్ అయిన అందాల నటి అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రానంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన ఈ జబర్దస్త్ లేడీ .. ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రెడీ అంటోంది. (Photo : Instagram)
ఏపీ అభివృద్దే లక్ష్యం..భవిష్యత్ తరాలకు మంచి జరగాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున రంగమ్మత్త ఎన్నికల ప్రచారం చేయాలని ఎదురుచూస్తోందట. పవర్ స్టార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు క్యాంపెయన్ చేయాలనే కుతూహలంగా ఉందట అనసూయ. (Photo : Instagram)
మెగా బ్రదర్ నాగబాబు జడ్జీగా వ్యవహరించిన జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ ద్వారా మెగా ఫ్యామిలీకి దగ్గరైన అనసూయ..అదే అవకాశంతో రంగస్థలంలో మెగా పవర్ స్టార్ తో నటించింది. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ పొలిటికల్ స్టెప్స్ కి తాను సాయం చేయాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది. (Photo : Instagram)
తనకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని చెప్పిన అనసూయ.. తనకు పార్టీలు ముఖ్యం కాదని... నాయకులు ముఖ్యమని చెప్పుకొచ్చింది. నాయకుల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తానని ప్రచారం చేస్తానని ఓ ఇంటర్వూలో చెప్పింది. (Photo : Instagram)
తన మాట వినేవాళ్లు కొందరు ఉండటం తన అదృష్టమని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే కచ్చితంగా ప్రచారానికి వెళ్తానని... తాను అందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పిలుపు కోసమే ఎదురుచూస్తున్నట్లుగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది అనసూయ. (Photo : Instagram)
అయితే అనసూయ జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి రెడీ అని సిగ్నల్ ఇవ్వడంతో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. (Photo : Instagram)
పవన్ కల్యాణ్ పిలిస్తే ప్రచారం చేస్తానంది అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ..ఆ పార్టీలకు చెందిన నాయకులు పిలిస్తే తప్పని సరిగా ప్రచారం చేస్తానని చెప్పకనే చెప్పింది అనసూయ. మరి స్టేట్ మెంట్ పై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. (Photo : Instagram)
జబర్దస్త్ షోకి దూరం కావడంపై కూడా అనసూయ స్పందించింది. డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ఈ కార్యక్రమాన్ని మానేశానని చెప్పింది. తనకు టైమ్ ఉన్నప్పుడల్లా సెట్స్ కు వెళ్తుంటానంది.(Photo : Instagram)
గతంలో తనపై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన కొంచెం పాత కాలం నాటి మనిషి కాబట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదని చెప్పారు. తనపై ఆయనకు చాలా చనువు ఉందని... అందుకే తాను పొట్టి డ్రెస్సులు వేసుకోవడం నచ్చలేదని ఆయన అన్నారని ఆ ఇష్యూని అడ్డుపెట్టుకొని కూడా ట్రోల్స్ చేశారని చెప్పుకొచ్చింది అనసూయ. (Photo : Instagram)

2024-03-27T17:57:19Z dg43tfdfdgfd