పవన్ కళ్యాణ్ కోసం కదులుతున్న హీరోలు.. నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా పోస్ట్‌లు వైరల్

పవన్ కళ్యాణ్‌కి, జన సేనకి టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా వీడియోను రిలీజ్ చేసిన తరువాత టాలీవుడ్ నుంచి హీరోల స్పందన బయటకు వస్తోంది. ఇప్పటికే నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా వంటి వారు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ట్వీట్లు, ఇన్ స్టాలో పోస్టులు పెడుతున్నారు. చూస్తుంటే మున్ముందు టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ జన సేనకు భారీగానే మద్దతు లభించేలా ఉంది.

తన తమ్ముడి కోసం చిరంజీవి వదిలిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. తన తమ్ముడి లాంటి నాయకుడే జనాలకు కావాలని, ఆ గొంతుని చట్ట సభల్లో వినిపించేలా చేయాలని, అందుకోసం పిఠాపురం ప్రజలు గాజు గ్లాసుకు ఓటు వేసి గెలిపించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి కోరారు. దీంతో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ కోసం ముందుకు వచ్చే వారి సంఖ్య పెరిగేలా ఉంది. చిరంజీవి వీడియో ఒక్కసారిగా నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో గాడ్ ఫాదర్ మూవీలో అందరూ దొరికిపోండి అనే డైలాగ్, ఆ సీన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

రాజకీయ పోరాటాన్ని మీరు ఎదుర్కొంటున్నారు.. మన సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబ సభ్యుడిగా మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను.. నేను విజయాన్ని కాక్షింస్తున్నాను.. నాలో మన కుటుంబ సభ్యులంతా కోరుకుంటారని ఆశిస్తున్నా.. ఆల్ ది బెస్ట్ సర్ అని నాని ట్వీట్ వేశాడు.

ఆంధ్ర ప్రదేశ్ పట్ల మీకున్న విజన్, కష్టపడుతున్న తీరుని ముందు నుంచీ నేను గమనిస్తూనే ఉన్నాను.. కోట్ల మంది ఆశిస్తున్నట్టుగా నేను కూడా ఎంతో ఆశో ఉన్నాను. ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తారని, మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి అంటూ రాజ్ తరుణ్ ట్వీట్ వేశాడు. త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ కళ్యాణ్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ తేజ సజ్జా ఇన్ స్టాలో స్టోరీ పెట్టేశాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T09:59:10Z dg43tfdfdgfd