పీహెచ్ సీలో టైల్స్ ఊడిపడి వర్కర్​కు గాయాలు

పీహెచ్ సీలో  టైల్స్  ఊడిపడి వర్కర్​కు గాయాలు

కుంటాల, వెలుగు: నిర్మల్​ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని పీహెచ్​సీలో పనుల్లో నాణ్యతా లోపం సిబ్బందికి శాపంగా మారింది. మంగళవారం హాస్పిటల్ లో పని చేస్తున్న కాంటిజెంట్​ వర్కర్  మిరియాల రవీందర్  గదులను శుభ్రం చేస్తుండగా, గోడపై నుంచి టైల్స్  ఊడి తలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. రవీందర్​ను మెరుగైన చికిత్స కోసం నిర్మల్  ఏరియా హాస్పిటల్ కు తరలించారు. నాసిరకంగా హాస్పిటల్  రిపేర్లు చేయడంతో వర్షపు నీళ్లు గదుల్లోకి వస్తోందని, మందులు పాడవుతున్నాయని పేర్కొంటున్నారు

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T02:48:12Z dg43tfdfdgfd