పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది

పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది

12 ఏళ్ల బాలిక తన పెంపుడు కుక్క చనిపోయిందన్న బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 6వ తరగతి చదువుతున్న 12ఏళ్ల బాలిక మూడు నెలల క్రితం ఓ కుక్క పిల్లను తెచ్చుకుని ఎంతో ప్రేమతో పెంచుకుంది.  అయితే 5 రోజుల క్రితం ఆ కుక్క పిల్ల చనిపోవడంతో  ఆ బాలిక అన్నం తినడం మానేసింది. ఇంట్లో వాళ్లు ఎంత నచ్చచెప్పిన వినలేదు.  

కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ బాధలో నుంచి బాలిక బయటకు రాలేకపోయింది.  ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీ శనివారం బాలిక తల్లి కూరగాయల కోసం బయటకు వెళ్లినప్పుడు బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  పక్కిింటి వాళ్లు బాలిక తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.  కళ్లముందు బిడ్డ మృతదేహాన్ని చూసి  ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T11:00:05Z dg43tfdfdgfd