పెన్సిల్ పై అయోధ్య బాల రాముడు.. శ్రీ రామ నవమి రోజు మహా అద్భుతం..

ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక కళాకారుడు రాముడిపై ఉన్న భక్తిని చాటి చెబుతూ అతి చిన్న పెన్సిల్ పై అయోధ్యలో ఉన్న బాలరాముని రూపాన్ని అచ్చు దిద్దినట్లు దించాడు. దీంతో రాముల వారికే ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా ఆ చక్కని రూపాన్ని పలువురు చూస్తూ ఆనందంగా ఆ సూక్ష్మ కళాకారుని అభినందించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రత్యేక గుర్తింపు పొందిన ఆ సూక్ష్మ కళాకారుడు ఏవిధంగా ఆ పెన్సిల్ పై రాముల వారి ప్రతిమను చెక్కారు ఆ విశేషాలు చూద్దాం.

ఉమ్మడి విశాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఆ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. మైక్రో ఆర్టిస్ట్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి అనేక రకాల దైవాతామూర్తులు స్వాతంత్ర సమరయోధుల రూపాలు అతి చిన్న పెన్సిల్ పై సుద్ధముక్కలపై చెక్కి తనదైన శైలిలో అందరి మన్నలను పొందుతూ ఉంటారు. నిజానికి భావితరాల వారికి మన సంస్కృతి చూపించాలి అనే లక్ష్యంతో అనేక రూపాలకు ప్రాణం పోసే విధంగా ఈ శిల్పి చెక్కే విధానం సైతం పలువురిని ఆకట్టుకుంటుంది.

గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తున్నాయా.. ఇలా సింపుల్ గా కట్టడి చేయవచ్చు..

తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముని తేజస్సు రూపాన్ని అతి చిన్న పెన్సిల్ పై తనదైన శైలిలో చెక్కి అందరి మన్ననలను పొందుతున్నాడు. రాముల వారికే ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం సందర్భంగా ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు 20 మిల్లీమీటర్లు పొడవులో రాముల వారి రూపానికి ప్రాణం వచ్చింది అనే విధంగా ఈ శిల్పి తన ప్రతిభను మరో మారు కనబరిచారు. ఇటీవలే అయోధ్యలో ప్రారంభించిన బాలరాముడు తేజస్సు ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ పెన్సిల్ పై చెక్కిన ఘట్టం వెంకటేష్ చెక్కిన రూపం సైతం అదే విధంగా దర్శనమిస్తుంది.

ప్రతి ఒక్కరికి సీతారామ లక్ష్మణులు ఆశీస్సులు ఉండాలని ఒక సంకల్పంతో ఈ చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా గెట్టం వెంకటేష్ తెలిపారు. అతి చిన్న పెన్సిల్ పై దాదాపు 6 గంటల కాలంలో ఈ పెన్సిల్ పై రామ రూపాన్ని చెక్కడం జరిగిందని తెలియజేశారు. శ్రీ రామ నవమి అనే కాకుండా విశేష పర్వదినాలు అంటే దసరా లేక ఉగాది లేక ఆంజనేయస్వామి జయంతి లేక గాంధీజీ జయంతి లేక డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి ఇలా ప్రముఖులు మహానుభావులు జయంతిలకు వారి ప్రతిబింబాలను ఇలా పెన్సిల్ పై సుద్ధముక్కలపై చెక్కుతూ భావితరాలకు వారి తేజస్సును అందిస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇప్పటివరకు రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు సైతం ఈ కళాకారుడిని ప్రత్యేకంగా అభినందించాయి. అనేక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు సైతం వెంకటేష్ కైవసం చేసుకున్నారు. ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ ఈ విధంగా ఒక రూపం తెస్తూ చెక్కడం తెలుగు రాష్ట్ర ప్రజల సైతం హర్షతి రేకాల వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు సైతం ఈ మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

2024-04-17T07:04:08Z dg43tfdfdgfd