ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు

ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు

  • లైంగిక వేధింపుల కేసులో జారీ చేసిన సిట్‌‌
  • కనిపించకుండా పోయిన డ్రైవర్

బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరు కావాలని, లేదంటే అరెస్ట్ తప్పదని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ్వర హెచ్చరించారు. అంతకు ముందు.. దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవంటూ కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన జర్మనీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌‌, ఆయన తండ్రిపై పోలీసులు కేసును నమోదు చేశారు. దర్యాప్తు కోసం కర్నాటక ప్రభుత్వం సిట్‌‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తమ ముందు హాజరు కావాలని రేవణ్ణకు సిట్‌‌ నోటీసులిచ్చింది. కానీ, ఆయన మాత్రం తనకు 7 రోజుల టైం కావాలని అడిగారు. అందుకు తిరస్కరించిన సిట్.. ప్రజ్వల్​పై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. కాగా, అభ్యంతరకర వీడియోలను బయటపెట్టడంలో ప్రజ్వల్ దగ్గర డ్రైవర్​గా పనిచేసిన కార్తిక్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజ్వల్​కు లుకౌట్ నోటీసుల తర్వాత కార్తిక్ కనిపించకుండా పోయాడు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-03T04:03:42Z dg43tfdfdgfd