ప్రతి నిమిషం పుస్తక పఠనం.. ఈ విద్యార్థిని సాధించిన మార్కులు అదుర్స్ కదూ !

ఈ విద్యార్థిని చదివింది ప్రభుత్వ గురుకుల పాఠశాలలో... అయితేనేమి ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తన సత్తా చాటింది. ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్థిని, ఉత్తమ మార్కులు సాధించడం పై గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించగా, వారిలో గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం మంచి మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరిలో నిజామాబాద్ జిల్లా ధర్మారంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని మేఘన ఒకరు.

Success story: బిజినెస్ బాస్ కావాలని జాబ్ వదిలి.. ఇప్పుడు నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు !

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన రేణుక గంగా బాబు దంపతుల కుమార్తె మేఘన బాల్యం నుండి ప్రత్యేక శ్రద్ధతో చదువుతూ ఉత్తమ మార్కులను సాధిస్తూ ఉపాధ్యాయుల చేత అభినందనలు అందుకుంది. ఈ క్రమంలోనే మేఘనను ధర్మారం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు చేర్పించారు. ఇంటర్లో ఎంపీసీ ఎంచుకున్న మేఘన, లెక్చరర్ లు చెప్పేటటువంటి పాఠాలను శ్రద్ధగా వింటూ ప్రతి పరీక్షలో ఉత్తమ మార్కులను సాధించింది.

కష్టాలతో నిరంతర పోరాటం.. కానీ ఇంటర్ లో టాపర్ !

ఈ దశలోనే ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులను సాధించి తన సత్తా చాటింది. ఈ సందర్భంగా లోకల్18 తో మేఘన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబ పోషణ సాగిస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే తాను ఇంటర్మీడియట్లో ఉన్నత మార్కులు సాధించడం జరిగిందన్నారు. అలాగే ప్రతిరోజు లెక్చరర్స్ చెప్పే పాఠాలను చదువుతూ వారు చెప్పిన విధంగా టైం టేబుల్ ప్రకారం తాను సాధన చేయడం జరిగిందని, మూడుసార్లు తాను సబ్జెక్ట్ ను రివిజన్ చేసినట్లు తెలిపారు. తమ కళాశాల ఎంపీసీ విభాగంలో 40 మంది విద్యార్థులకు గాను ముగ్గురికి మినహా మిగిలిన విద్యార్థులందరికీ 400కు పైగా మార్కులు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులో తాను ఐఐటీలో రాణించి ఉన్నత ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివిన మేఘన తాను అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అందరూ ఆశిద్దాం.

2024-04-29T05:32:28Z dg43tfdfdgfd