ప్రభాస్ ఎవరు? అని అడిగారు.. నెట్టింట్లో రానా మాటలు వైరల్

బాహుబలి సినిమా కంటే ముందు మన టాలీవుడ్ అన్నా.. టాలీవుడ్ హీరోలన్నా కూడా బాలీవుడ్‌లో చిన్న చూపు ఉండేది. మన వాళ్లని అక్కడి వాళ్లు అంతగా పట్టించుకునే వాళ్లు కాదు. అయితే బాహుబలి టైంలోనే రానా బాలీవుడ్‌కు ఏదో పని మీద వెళ్లాడట. అప్పటికే రానా బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసి ఉండటంతో అక్కడి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బాహుబలి సినిమా గురించి అక్కడి వాళ్లకు చెప్పాడట. బాహుబలిగా ఎవరు నటిస్తున్నారని అడిగారట.

ప్రభాస్ నటిస్తున్నాడని చెబితే.. ప్రభాస్ ఎవరు? అని అన్నారట. వాళ్లకి ఎలా చెప్పాలో తెలియక.. మిర్చి, ఛత్రపతి సినిమాలు చూశారా? అని అంటే చూడలేదు అని అన్నారట. అక్కడి వాళ్లకి చిరంజీవి, వెంకటేష్ వంటి వారు తప్పా ఈ జనరేషన్ హీరోలు తెలియదట. నమ్రత భర్తగా మహేష్ బాబు మాత్రమే తెలుసు అంటూ రానా అక్కడ జరిగిన విషయాన్ని తాజాగా పంచుకున్నాడు.

ఇక ఇండియా నుంచి వచ్చే పెద్ద థింగ్‌ కల్కి అవుతుందని, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారని, అవేంజర్స్ టైపులో హాలీవుడ్ స్థాయిలో ఉంటుందన్నాడు రానా. అదే సమయంలో రజినీకాంత్ వేట్టయాన్ గురించి కూడా మాట్లాడాడు. వేట్టయాన్ మూవీ అసలు రజినీకాంత్ స్టైల్లో ఉండదని, అలాంటి డిఫరెంట్ సినిమాను ఆయన ఒప్పుకున్నందుకు, అందులో నేను నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని రానా చెప్పుకొచ్చాడు.

అమితాబ్, ఫాహద్ ఫాజిల్ ఇలా చాలా భారీ క్యాస్టింగ్‌తో సినిమా రాబోతోందని, రీసెర్చ్ చేసి రాసిన స్టోరీలా ఉంటుందని, జ్యుడీషయల్, పొలీస్, ఎంటర్ ప్రెన్యూర్ ఇలా చాలా యాంగిల్స్‌లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు రానా.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T16:49:32Z dg43tfdfdgfd