ప్రభాస్ 'కల్కి'లో శ్రీకృష్ణుడి పాత్ర వెనుక లెజెండ్రీ డైరెక్టర్.. ఇంత జరిగిందా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD చిత్రాన్ని నాగ అశ్విన్ మహాభారతంతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD చిత్రాన్ని నాగ అశ్విన్ మహాభారతంతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 500 కోట్లకి పైగా బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ఇంకా చాలా మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండబోతోంది. అమితాబ్ బచ్చన్ ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వథామ గా అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. మహాభారతంతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఆ ఇతిహాసంలోని మరిన్ని పాత్రలో ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉంది. 

వాటన్నింటిని కలుపుతూ డైరెక్టర్ నాగ అశ్విన్ ఎవరూ చేయని సాహసం చేస్తున్నారు. మహాభారతం అంటే శ్రీకృష్ణుడు పాత్ర లేకుంటే ఎలా ? కృష్ణుడి పాత్ర ఈ చిత్రంలో కీలకం కాబోతోంది. అయితే ఈ చిత్రంలో కృష్ణుడి పాత్ర సృష్టి వెనుక ఓ లెజెండ్రీ డైరెక్టర్ ఉన్నారట. 

ఆయన ఎవరో కాదు సింగీతం శ్రీనివాసరావు. సింగీతం శ్రీనివాసరావుకి పౌరాణిక చిత్రాల్లో చాలా అనుభవం ఉంది. మాయాబజార్ లాంటి చిత్రానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి అద్భుత చిత్రాలు తెరకెక్కించారు. కృష్ణుడి పాత్ర చుట్టూ సైన్స్ ఫిక్షన్ జోడించి సింగీతం శ్రీనివాసరావు ఒక కథ రెడీ చేసుకున్నారట. 

కల్కి చిత్రంలో కూడా కృష్ణుడి పాత్ర సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉంటుందట. దీనితో నాగ్ అశ్విన్, అతడి టీం సింగీతం ని కలసి కృష్ణుడి పాత్ర కోసం ఇన్ పుట్స్ తీసుకున్నారట. కృష్ణుడి శక్తి గురించి ఎక్కువగా బయట వినిపించిన కొన్ని విషయాలని కూడా సింగీతం కల్కి చిత్ర యూనిట్ తో పంచుకున్నారట. 

తాను కృష్ణుడి పాత్రతో సైన్స్ ఫిక్షన్ కథ చేయాలనుకుని చేయలేక పోయారు. ఆ కథలో ఇన్ పుట్స్ కల్కి టీం కి ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారట. ఈ మేరకు బలమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. 

2024-05-06T10:56:09Z dg43tfdfdgfd