ప్రియురాలికి రూ.80 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియుడు.. బ్యాంక్‌కు వెళ్లగా ప్రేయసికి ఊహించని అనుభవం

ప్రేమలో పడ్డ వారు బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమే. ఎవరి స్తోమతను బట్టి వారు తమ ప్రేయసికి గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. డబ్బున్న వారు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వారు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. ఇక బర్త్ డేలు, స్పెషల్ డేల్లో గిఫ్ట్‌లు లేకపోతే లవర్ అలిగిన సందర్భాలు కూడా ఉంటాయి. మరికొన్నిసార్లు గిఫ్ట్‌ల కారణంగానే విడిపోయిన సంఘటలను కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు అవాక్కయింది. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు ఫ్లాట్ కొనివ్వాలని ప్రియురాలి పేరెంట్స్ ఓ కండీషన్ పెట్టడంతో ఆ యువకుడు ఎవరూ వేయని ఐడియా వేశాడు. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది.

చైనాలో ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు చివరికి వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేశారు. అయితే వారి ప్రేమను అంగీకరించిన ప్రియురాలి తల్లిదండ్రులు.. పెళ్లి చేయాలంటే మాత్రం తాము చెప్పిన పని ఒకటి చేయాలని షరతు పెట్టారు. పెళ్లికి ముందే తమ కుమార్తె పేరు మీద ఒక ఫ్లాట్ కొనాలని అతడికి సూచించారు. అలా అయితేనే తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామని వారు చెప్పారు. అయితే ఫ్లాట్ కొనేందుకు ఆ వ్యక్తి వద్ద డబ్బులు లేకపోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తన ప్రియురాలికి మాత్రం భారీ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో పడ్డాడు.

చివరికి ఆ యువకుడు ఒక ప్లాన్ చేశాడు. మొత్తం రూ.80 లక్షలు సర్దేశాడు. వాటిని తీసుకెళ్లి.. తన లవర్‌కు ఇచ్చాడు. దీంతో ఆమె ఎంతో సంతోషంగా తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వాటిని అకౌంట్‌లో జమ చేసేందుకు వెళ్లేందుకు బ్యాంకుకు వెళ్లారు. క్యాష్ కౌంటర్‌కు వెళ్లి ఆ డబ్బులను చూపించగా.. నకిలీవని బ్యాంకు అధికారులు తేల్చారు. పైకి నిజమైన నోట్లను పెట్టి లోపల అన్నీ నకిలీ నోట్లు పెట్టి ఉన్నాయి. దీంతో తన లవర్ చేసిన అసలు బండారం బయటపడింది. ఈ సంఘటనతో ప్రియుడితోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. నకిలీ నోట్లు పెట్టి మోసం చేయడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T15:24:06Z dg43tfdfdgfd