ప్రభుదేవా హీరోగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది ప్రేమికుడు సినిమా. 30ఏళ్ల క్రితం విడుదలైన ఈమూవీ అప్పటి యూత్ ను ఉర్రూతలూగించింది. 90స్ లో ఈసినిమా ఓ సంచలనం. యువతలో ప్రేమనుచివురింపచేసిన సినిమా ప్రేమికుడు.
కొరియోగ్రఫర్ గా అప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభుదేవ.. స్క్రీన్ పై హీరోగా డాన్సులతో దడదడలాడించాడు. ప్రభుదేవ డాన్స్ లకు తోడు నగ్మ అంద చందాలు, నటనతో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఈసినిమాకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరోఎత్తు. ఏఆర్ రెహమాన్ స్వరాలు ఆడియన్స్ ను సరికొత్త మ్యూజిక్ ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి.
ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ప్రేమికుడు సినిమా మరోసారి అలరించడానికి రెడీ అయ్యింది. మే 1న ప్రేమికుడు’ మళ్లీ థియేటర్లలోకి రానున్నాడు. అప్పుడు యూత్ ను అలరించిన ఈ సినిమా.. ఇప్పుడ యూత్ ను టార్గెట్ చేస్తూ.. రీ రిలీజ్ అవ్వబోతోంది. అదే క్రేజ్ ను కంటీన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
రమణ, మురళీధర్ ఈ రీరిలీజ్‌కు నిర్మాతలు. మే 1న 300లకు పైగా థియేటర్లలో ఘనంగా ‘ప్రేమికుడు’ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రజలనుండి అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేటి యువత కూడా ఎదురు చూస్తున్నదని వారు అన్నారు. ఇంకా నిర్మాత శోభారాణి కూడా మాట్లాడారు. ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, గిరీశ్‌కర్నాడ్, వడివేలు, రఘువరన్ ఇందులో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
2024-04-28T09:39:33Z dg43tfdfdgfd