బాయ్‌ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడని.. లేడీ డాక్టర్ ఇంటికి పిలిచి ఏం చేసిందంటే?

బాయ్‌ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడని.. లేడీ డాక్టర్ ఇంటికి పిలిచి ఏం చేసిందంటే?

ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల అవివాహిత లేడీ డాక్టర్(25) కిరాతంగా వ్యవహరించింది. బిహార్ లోని సరన్ జిల్లా మ‌ధురా బ్లాక్‌లోని వార్డు నెంబ‌ర్ 12 కౌన్సిల‌ర్‌, ఓ మహిళా డాక్టర్ లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. దానికి అతను అభ్యంతరం చెప్పాడు. ఆమె రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సిద్ధమైంది. పెళ్లి కోసం ఆమె కోర్టుకు వెళ్లింది. అయినా ఏం అతడు ఏం మారలేదు. 

బాయ్‌ఫ్రెండ్ విధానంపై విర‌క్తి చెందిన ఆ డాక్టర్‌.. త‌న ఇంటికి అత‌న్ని పిలిచింది. ఇంటికి వ‌చ్చిన ఆ కౌన్సిల‌ర్ పురుషాంగాన్ని క‌ట్ చేసింది. అయితే కౌన్సిల‌ర్ అరుపులు విన్న స్థానికులు.. జ‌రిగిన ఘ‌ట‌న గురించి పోలీసుల‌కు తెలిపారు. అత‌న్ని వెంట‌నే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితురాలిది హ‌జిపూర్. మ‌ధౌరాలో ఆమె ప్రాక్టీసు చేస్తోంది. బాధిత వ్యక్తి కూడా పెళ్లి కాని యువకుడని మ‌ధౌరా పోలీసు స్టేష‌న్ అధికారి తెలిపారు. నిందితురాల‌ని హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేశామ‌ని, త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-02T12:16:12Z dg43tfdfdgfd