బాల సంస్కార్ తరగతుల బాట పడుతున్న చిన్నారులు.. ఎందుకంటే ?

శ్రీకాకుళం పట్టణంలో శ్రీ బాలాత్రిపురసుందరి దేవి దేవాలయంలో పిల్లలకు బాల సంస్కార్ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ధర్మం భక్తి యోగ భాగవత శ్లోకాలు నేర్పించే కార్యక్రమం బాల సంస్కార్. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు మన హిందూ సంప్రదాయానుసారంగా చేయవలసిన ధర్మం కార్యక్రమాలు.. పిల్లల్లో భక్తి చింతన.. పెద్దలతో ఎలా మెలగాలి అనేవి నేర్పిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో హిందుత్వం గురించే కాకుండా యోగాసనాలు పిల్లలతో వేయిస్తూ వాటి వలన కలిగేప్రయోజనాలు వివరిస్తున్నారు.

ఉదయం లేవగానే ఓంకారంతో మొదలుపెడితే ఆ రోజు అంతా చాలా సానుకూలంగా ఉంటుంది అని అంటున్నారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన దైవికచింతల పిల్లలలో కలిగించాలని తాపత్రయంతో ఈ బాల సంస్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అని అన్నారు. ఇక్కడ భగవద్గీత, హనుమాన్ చాలీసా, దీవిక శోత్రములు పిల్లలకు నేర్పిస్తున్నారు.

PM Kisan: భారీ శుభవార్త.. ఈ సారి అకౌంట్లోకి రూ.6 వేలు.. ఈ ఒక్కపని చేస్తే చాలు..

అంతే కాకుండా పిల్లల్ని ఆధ్యాత్మికతవైపు నడిపించడం వలన ఎంత ఆనందాన్ని బలాన్ని మానసిక స్థైర్యం వాళ్ళు పొందగలుగుతారు అని అంటారు. మొక్కై వంగని మానేయ్ వంగునా అనే నానుడి ప్రకారం పిల్లల్ని చిన్నప్పుడు ఆధ్యాత్మిక వైపు మళ్ళించడం వలన ఆనందంగా సుఖంగా సంతోషంగా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

2024-05-08T07:06:59Z dg43tfdfdgfd