బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

 బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్ అరెస్ట్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు.  పంతంగి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్ ను ఉస్మానియా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో  రిలీజ్ అయిన సర్కులర్ ను ఎడిట్ చేశాడని మన్నె క్రిశాంక్ పై కేసు నమోదు చేశారు. 

వైద్య పరీక్షల నిమిత్తం క్రిశాంక్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. తర్వాత  మరికాసేపట్లో జడ్జి నివాసంలో జడ్జి ముందు హాజరుపరచనున్నారు. క్రిశాంక్ తో పాటు నాగేందర్ అనే నిజాం కాలేజ్ స్టూడెంట్ లీడర్ పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు. గతంలో క్రిశాంక్ పై 14 కేసులు ఉన్నట్లు కోర్టుకు తెలిపిన పోలీసులు. రాష్ట్రంలో హాట్ టాపింక్ గా నిలిచిన ఓయూ నీటి కొరత.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-01T18:13:06Z dg43tfdfdgfd