బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
ఇద్దరు స్నేహితులు సరదాగా చేసిన పని ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. 24 ఏళ్ల యోగీష్, 25 ఏళ్ల మురళి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. బెంగళూరులోని సంపిగేహళ్లి ఉంటారు. మురళి బైక్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తుంటాడు. యోగేష్ అతన్ని కలవడానికి అక్కడికి వెళ్లాడు. మోటారు బైక్ వాష్ పూర్తయిన తర్వాత, ఇద్దరూ వాహనాలను ఆరబెట్టడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ బ్లో డ్రైయర్‌తో సరదాగా ఆడుకోవడం ప్రారంభించారు. మురళి మొదట యోగేష్ ముఖంపై బ్లో-డ్రైయర్‌ను ఉపయోగించాడు, ఆ తరువాత అతని వీపుపై, చివరకు అతని పురీషనాళాన్ని వేడి గాలితో నింపాడు.
వేడి ఫిల్టర్ గాలి యోగీష్ శరీరంలోకి మలద్వారం ద్వారా ఎక్కువగా ప్రవేశించడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యోగీష్ కుప్పకూలిపోవడంతో మురళి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాడు. మలద్వారం ద్వారా బ్లో డ్రైయర్ అధిక ఒత్తిడి కారణంగా యోగీష్ పేగులకు ప్రమాదం జరిగిందని వైద్యులు తెలిపారు. వెంటనే యోగీష్కి ఆపరేషన్ ను ప్రారంభించారు. అయితే చికిత్సకు యోగీష్ స్పందించకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విజయపురానికి చెందిన యోగీష్ బెంగళూరులో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. తానిసంద్రలో అమ్మమ్మతో కలిసి నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మురళి పైన సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే యోగీష్ అవయవాలు ఎలా దెబ్బతిన్నాయనేది తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్టు వచ్చేవరకు కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T10:28:58Z dg43tfdfdgfd