భార్య కాదు గయ్యాళి.. భర్తకు టార్చర్.. సిగరెట్లతో వాతలు పెట్టింది.!

ఉత్తరప్రదేశ్.. బిజ్నూర్‌కి చెందిన ఓ మహిళ.. తన భర్తను రాచి రంపాన పెడుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైంది. అతని శరీరంపై ఆమె సిగరెట్లతో వాతలు పెట్టినట్లు తెలిసింది. ఆమె పేరు మెహర్ జహాన్. భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా.. ఆమెను మే 5న సియోహరా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

భర్త పేరు మహాన్ జైదీ. తన భార్య తనకు మత్తు మందు ఇచ్చి.. చేతులు, కాళ్లను కట్టేసి.. సిగరెట్ వెలిగించి.. ఒళ్లంతా వాతలు పెట్టిందని కంప్లైంట్‌లో తెలిపాడు.

మొదట పోలీసులు నమ్మలేదు. ఎందుకంటే.. సహజంగా భర్తలు, భార్యల్ని హింసించడం మనం చూస్తుంటాం కదా.. పోలీసులు కూడా అలాంటి కేసులు చూసీ చూసీ.. ఇది రివర్సులో ఉండే సరికి నమ్మలేకపోయారు. ఐతే.. బాధితుడు తెలివైన వాడు. వారికి తన ఇంటి CCTV ఫుటేజ్ చూపించాడు. అది చూశాక పోలీసులకు నమ్మకం కలిగింది. వామ్మో.. ఇలాంటి భార్యలు కూడా ఉంటారా అనుకుంటూ ఆమెను అరెస్టు చేశారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

ఇక్కడ మరో విషయం ఉంది. ఆమె తన భర్తను వేధించడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా చాలాసార్లు హింసించింది. ఇదివరకు ఓసారి ఇలాగే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే, పోలీసులు నమ్మలేదు. దాంతో.. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు పక్కా ఆధారాలతో కేసు ఫైల్ చెయ్యడంతో.. పోలీసులు నమ్మగలిగారు.

ఐపీసీలోని హత్యాయత్నం, దాడి, హింసకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు రాసి, ఆమెను అరెస్టు చేశారు.

ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి.. పోలీసులకు పని తేలికైపోయినట్లే. త్వరలోనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తానికి ఈ కేసు పోలీసులనే కాదు.. ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి భార్యలుంటే.. భర్తలకు కష్టమే అంటున్నారు నెటిజన్లు.

2024-05-07T03:32:30Z dg43tfdfdgfd