మంచు విష్ణుకు మహేష్ బాబు చేసిన మోసం ఏమిటీ..? డబ్బులు తీసుకుని మరీ హ్యాండ్ ఇచ్చాడా!

2021 లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ కి మాయని మచ్చ. రోడ్డున పడి ప్రముఖులు ఆరోపణలు చేసుకున్నారు. కాగా మంచు విష్ణు దగ్గర ఓటు వేస్తానని మహేష్ బాబు డబ్బులు తీసుకున్నాడట. కానీ హ్యాండ్ ఇచ్చాడట. అప్పుడు మంచు విష్ణు ఏం చేశాడంటే.. 

 

2021 లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. ప్రకాష్ కి మద్దతుగా మెగా ఫ్యామిలీ నిలిచింది. మంచు విష్ణు తన సామాజిక వర్గం పై ఆధారపడ్డాడు. సూపర్ స్టార్ కృష్ణను నేరుగా కలిశాడు. నందమూరి కుటుంబంతో పాటు పలువురు మంచు విష్ణుకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. 

ఎన్నికల ప్రచారం ప్రత్యక్ష ఎన్నికలను తలపించింది. ఒకరి మీద మరొకరు దిగజారుడు ఆరోపణలు చేసుకున్నారు. నరేష్-నాగబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. ఇంకొందరు ఆర్టిస్ట్స్ సైతం దూషించుకున్నారు. మొత్తంగా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడు అయ్యాడు. 

 

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఆయన ప్యానెల్ లో గెలిచిన సభ్యులు రాజీనామా చేశారు. ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ అనే ముద్ర వేసినందుకు హర్ట్ అయిన నాగబాబు తన మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంచు విష్ణు ఓట్లను కొన్నారని, ఫోన్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు చెల్లించారని ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపించారు. 

విజయం అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన మంచు విష్ణు కీలక ఆరోపణలు చేశాడు. చిరంజీవి అంకుల్ నన్ను పోటీ నుండి తప్పుకోమని అన్నారని బహిరంగంగా మంచు విష్ణు విమర్శించారు. అలాగే తాను ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి ఓట్లు కొన్నానని చేస్తున్న ఆరోపణల మీద కూడా మంచు విష్ణు స్పందించారు. అవును నేను మహేష్ బాబుకు ఓటు వేయాలని ఫోన్ పే లో రూ. 75000 చెల్లించాలని మంచు విష్ణు సెటైర్ వేశాడు. 

 

దీనిపై అనంతరం ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు వివరణ ఇచ్చారు. మీరు మహేష్ బాబుకు ఫోన్ పే లో డబ్బులు చెల్లిస్తే... తీరా ఆయన ఓటు వేయలేదట కదా... అని యాంకర్ అడగ్గా.. అవును నేను తిరిగి మహేష్ బాబును డబ్బులు అడిగాను. ఓటు వేయలేదు కాబట్టి నా డబ్బు నాకు ఇచ్చేయమని అన్నాను.. అని మరోసారి ఫన్నీగా స్పందించారు.

మీరు ఏదో అనుకుంటారు కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలమంతా చాలా సరదాగా ఉంటాము. జోక్స్ వేసుకుంటాము, అని మంచు విష్ణు అన్నారు. ఓట్లు కొని గెలిచానని వస్తున్న ఆరోపణలకు మంచు విష్ణు... అలా మహేష్ బాబు పేరు చెబుతూ ప్రత్యర్థులకు చురకలు వేశాడు.అంతే కానీ, నిజంగా మహేష్ బాబు ఓటుకు డబ్బులు తీసుకోలేదు..

2024-07-02T15:10:34Z dg43tfdfdgfd