మందులో హాట్ వాటర్, ఎప్పుడూ ఓ బాటిల్ దగ్గరే ఉంటుంది... బాలయ్య వ్యసనం మీద అల్లుడు షాకింగ్ కామెంట్స్!

హీరో బాలకృష్ణకు మద్యం అలవాటు ఉందన్న ఆయన అల్లుడు భరత్ కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. మామయ్య ఓ బాటిల్ బ్యాగ్ లో ఎల్లప్పుడూ క్యారీ చేస్తాడని అన్నారు.  ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

హీరో బాలకృష్ణకు మద్యం అలవాటు ఉండనే ఓ వాదన ఉంది. ఈ విషయాన్ని బలపరిచేలా పలు సందర్భాల్లో బాలకృష్ణ కామెంట్స్ చేశారు. అన్ స్టాపబుల్ షో వేదికగా గెస్ట్ లతో మందు ప్రస్తావన ఆయన తెచ్చారు. సాయంత్రం అయితే పెగ్ వేయాల్సిందే అన్నట్లు మాట్లాడారు. 

 

బాలయ్య కేవలం ఒకే బ్రాండ్ వాడతాడట. ఆయనకు మ్యాన్షన్ హౌస్ అంటే ఇష్టం అట. 2019 ఎన్నికలకు ముందు బాలకృష్ణ మీద నాగబాబు  వరుస వీడియోలు చేశాడు. ఆయన ఇమేజ్ దెబ్బ తీసేలా సీరియస్ కామెంట్స్ చేశాడు. ఒకసారి సోషల్ మీడియా చాట్ లో నాగబాబు... 'మా బ్లడ్ వేరు మా బ్రాండ్ వేరు' అని కామెంట్ పెట్టి మ్యాన్షన్ హౌస్ బాటిల్ జోడించాడు. 

 

బాలయ్య అభిమానులు ఆయన మ్యాన్షన్ హౌస్ తాగుతాడనే విషయాన్ని ఏమంత అవమానంగా భావించరు. ఒకింత ప్రౌడ్ గా చెప్పుకుంటారు. మ్యాన్షన్ హౌస్ ని బాలయ్య బ్రాండ్ అని పిలుచుకుంటారు. తాజాగా బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ ఈ విషయాన్ని ఓపెన్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

భరత్ మాట్లాడుతూ.. మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడనికి తెలిశాక ఆ కంపెనీ స్టాక్స్ విలువ పెరిగింది అన్నారు. ఆయన హాట్ వాటర్ లో కలుపుకుని తాగుతాడట కదా? అని యాంకర్ భరత్ ని అడగ్గా... అవును అది నిజం అని ఒప్పుకున్నాడు భరత్. 

 

ఆయన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది. అందులో హాట్ వాటర్, మందు బాటిల్ ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే. అమెరికా వెళ్లినా కూడా దాన్ని వెంట తీసుకెళతాడు... అని భరత్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

వ్యసనాన్ని గొప్పతనంగా చెప్పుకోవడం ఏమిటని కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాగే టాప్ హీరోగా ఉన్న బాలయ్య మందు తాగుతాడని పబ్లిక్ గా చెబితే, ఆయన ఫ్యాన్స్ స్ఫూర్తి పొందొచ్చు. వాళ్ళకు మద్యం తాగాలనే ఆలోచనలు పుట్టొచ్చని ఎద్దేవా చేస్తున్నారు. 

నోట్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం 

2024-04-29T12:44:15Z dg43tfdfdgfd