ముద్దుల కొడుకుతో అందాల పూర్ణ... ఫాలోవర్స్‌తో పంచుకుంటూ మురిసిపోతున్న సీనియర్ నటి..

అందాల నటి పూర్ణ ఇటీవల తల్లైన సంగతి తెలిసిందే. పూర్ణకు గతేడాది జూన్‌లో దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో జరిగింది. పూర్ణ 2023 మొదటి వారంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజా వార్త ఏమిటంటే, నటి పూర్ణ  తాజాగా తన కొడుకు ఫోటోలను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. భర్తతో కలిసి ఆ ఫోటోలో ఆమె తన కొడుక్కి ముద్దు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. Photo : Instagram
ఇక ఆమె ఆ మధ్య కొడుకు పేరును ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకుంటూ తన బిడ్డ పేరును తెలిపారు. పూర్ణ తన కొడుకు పేరు హమ్దాన్ అసిఫాలీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Instagram
అందాల నటి పూర్ణ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరుకారం సినిమాలో ఓపాటలో మెరిసింది. అంతేకాదు నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె విలన్‌కు భార్యగా మాత్రమే కాదు.. ఓకీలక సన్నివేశంలో హీరోకు అసలు నిజం చెప్పే పాత్రలో కనిపించి అదరగొట్టారు. థియేటర్స్‌లో ఇరగదీసిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  Photo : Instagram
పూర్ణ నటన కెరీర్ విషయానికి వస్తే..  తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు.  Photo : Instagram.
పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. Photo : Instagram
 పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. Photo : Instagram
దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.. Photo : Instagram
ఇక పూర్ణ సినీ కెరీర్ విషయానికి వస్తే... అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది పూర్ణ..Photo : Instagram
పూర్ణ అఖండ సినిమాలోను నటించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). Photo : Instagram
ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ’అఖండ’తో పాటు ‘జై బాలయ్య’ పాటకు మాస్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది.. థియేటర్స్‌లో కూడా మంచి వసూళ్లను సాధించింది అఖండ మూవీ. ప్రస్తుతం  హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. Photo: Instagram

2024-03-29T12:31:58Z dg43tfdfdgfd