మున్నేరు నదిలో .. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

మున్నేరు నదిలో .. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

  • చనిపోయినవారిలో ఇద్దరు అన్నదమ్ములు

ఖమ్మం రూరల్, వెలుగు: మున్నేరు నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ విషాదకర ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో  చోటుచేసుకుంది. ఖమ్మం సిటీలోని మమత హాస్పిటల్​వెనక ప్రాంతంలో నివాసిస్తున్న అముదాల చిరంజీవికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వేసవికాలం కావడంతో చిరంజీవి కొన్ని రోజులుగా  చేపలు పట్టేందుకు మున్నేరుకి వెళ్తున్నాడు. గురువారం కూడా చేపలు పట్టేందుకు వెళ్లాడు. చిరంజీవి వెళ్లిన కొద్ది నిమిషాలకే ఆయన కొడుకులు లోకేశ్​(13), హరీశ్​(9) తమ పక్కింటి బాలుడు బాణోత్​గణేశ్(9)​తో కలిసి ఆటోలో ధంసలాపురం వద్ద మున్నేరుకు వెళ్లారు. 

చిరంజీవి చేపలు పడుతుండగా..ఆ పక్కనే చిన్నారులు గ్రీన్​ఫీల్డ్ హైవే పిల్లర్​కోసం తవ్విన గుంతలో ఈతకొట్టేందుకు దిగారు. అది లోతు ఎక్కువ ఉండటంతో ఒకరి తరువాత ఒకరు నీటిలో మునిపోయారు. గమనించిన చిరంజీవి పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే తన ఇద్దరు కొడుకులతో పాటు గణేశ్ కూడా చనిపోయాడు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. గణేశ్​తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T01:21:26Z dg43tfdfdgfd