మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

నిప్పులు చెరిగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాలైన జంతువులు, పక్షులు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు, పక్షులకు నీళ్లు అందించి వాటి ప్రాణాలు కాపాడుతుంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. దాహంతో ఉన్న మనిషికి నీళ్లు తాగేందుకు సాయం చేసి వావ్ అనిపించింది ఓ ఏనుగు. 

ఈ ఆసక్తికర సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్కులో చోటుచేసుకుంది.  పార్కులోని చేతిపంపును ఏనుగు తొండంతో కొడుతుండగా.. గార్డు సుదీప్ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అచ్చం మనుషుల్లాగానే తొండంతో చేతి పంపు కొడుతూ దాహం తీర్చిన ఏనుగు రూపకు పలువురు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ ఏనుగుల పార్కులో ప్రస్తుతం 9 వరకు చిన్న, పెద్ద ఏనుగులు ఉన్నాయని.. వేసవి కాలంలో అడవిలోని చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఏనుగులు ఇలా చేస్తుంటాయని క్యాంప్ నిర్వాహకులు చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T12:00:11Z dg43tfdfdgfd