మారుతి ‘బ్యూటీ’ఫుల్ మూవీ ప్రారంభం

బేబీ మూవీ తెర మీదకు రావడంలో దర్శకుడి మారుతి హస్తం ఎంత ఉందనేది అందరికీ తెలిసిందే. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లను పసిగట్టడంలో మారుతి ముందుంటాడు. మారుతి దర్శకత్వం వహిస్తూనే.. చిన్న చిత్రాలు నిర్మిస్తూ కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు. అలా ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కథను తెర మీదకు తీసుకు రాబోతోన్నాడు. ప్రభాస్‌తో రాజా సాబ్ చేస్తున్న మారుతి.. నిర్మాతగా మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేశాడు.

డైరెక్టర్ మారుతి టీమ్ ప్రోడక్ట్, వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో బ్యూటీ అనే చిత్రం రాబోతోంది. ఇందులో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బ్యూటీ అనే చిత్రం రాబోతోంది.

ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీర శంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ చిత్రం మే 2 నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. బేబీ సినిమాతో సెన్సేషన్‌గా మారిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫర్‌గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-22T11:47:01Z dg43tfdfdgfd