మీ అమ్మనో, అక్కనో అంటే చెప్పుతో కొడతారు.. ట్రోల్స్, రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్స్, అలాగే సినిమాలకు ఇచ్చే రివ్యూలపై స్పందించారు. ఆమె ఫైర్‌ అయ్యింది. వీరికి ఏం అర్హత ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. 

లేడీ రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది వరలక్షి శరత్‌ కుమార్‌. ఆమె సినిమాల్లో పాత్రలు అలానే ఉంటాయి. రియల్‌ లైఫ్‌లోనూ ఆమె అంతే బోల్డ్ గా, ఓపెన్‌గా ఉంటుంది. ఏం అనిపిస్తే అది చెప్పేస్తుంది. దీంతో పలు మార్లు ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్రోల్స్, రివ్యూలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 

 

తమ సినిమాలపై సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ పై ఆమె రియాక్ట్ అవుతూ, ఒకప్పుడు ఆడియెన్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్‌ ఉండేది. థియేటర్లలో కలిసినప్పుడు సినిమాపై ఓపీనియన్‌ చెప్పేవాళ్లు. అయితే డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎవరూ నెగటివ్‌గా చెప్పరు, బాగుందనేఅంటారు, అరుస్తుంటారు. దీంతో పాజిటివ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చి ప్రతి ఒక్కరు తమకు నచ్చిన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. 

 

అయితే నెగటివ్‌గా పెడితే ఎక్కువ వ్యూస్‌, క్లిక్స్ వస్తాయని చెప్పి, అదొక ప్యాషన్‌గా నెగటివ్‌ గా చెబుతున్నారని, బాగా లేదని, వేస్త్ అని అంటుంటారు. రెండోది మీ డ్రెస్‌ గురించి అడిగితే చాలా అసహ్యంగా ఉందని చెప్పొచ్చు. ఇది వాళ్లు ఫ్రాంక్‌ నెస్‌ అనుకుంటారు. కానీ అదే విషయాన్ని `నాకేమో నీ డ్రెస్‌ నచ్చలేదు, నీకు కంఫర్ట్ అనిపిస్తే వేసుకో` అని చెప్పడం మరో స్టయిల్‌. ఇందులో మూడోది హానెస్టీ. 

కానీ చాలా మంది నీచంగా కామెంట్‌ చేస్తూ నేను నిజాయితీగా చెప్పానని అంటుంటారు. కానీ అది హానెస్టీ కాదు, మీ అమ్మ గురించో, మీ అక్క గురించో అలా మాట్లాడితే చెప్పుతో కొడతారు. కాబట్టి ఇలాంటి బేస్‌లెస్‌, ఐడెంటిటీ లేని వాళ్లు కామెంట్‌ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు కామెంట్‌ చేయడానికి వాళ్లు ఎవరు. ఏ పని లేకి ఇంట్లో ఖాళీగా కూర్చొని కామెంట్లు చేస్తుంటారు. వాళ్లు జీవితంలో సాధించింది ఏంటి? ఏమీ ఉండదు. అలాంటిది వాళ్లకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలని ప్రశ్నించింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. ఇలాంటి కామెంట్లని నవ్వుకుని వెళ్లిపోతా అని తెలిపింది.

 

పబ్లిక్‌ రివ్యూ, క్రిటిక్స్ గురించి చెబుతూ, వాళ్లు ప్రతి సినిమాని బాగాలేదని చెబుతుంటారు. అలాగని చెప్పి ఒక రోజు సినిమాలు తీయడం ఆపేస్తే, ఏం చేస్తారు, ఇండస్ట్రీ అనేది ఒక సర్కిల్‌, అన్ని నడుస్తుంటాయి. కానీ సినిమా చూసి వెంటనే ఫస్ట్ పది నిమిషాలు బాగాలేదు, ఆ తర్వాత బాగాలేదని సినిమా మొత్తం చెప్పేస్తారు. కానీ సినిమానే లేకపోతే ఏం చేస్తారు ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇస్తారు డబ్బులు అని సెటైర్లు పేల్చింది వరలక్ష్మి. 

 

ఆమె ఇంకా రియాక్ట్ అవుతూ, రివ్యూలను తాను అస్సలు ఫాలో అవ్వని అని తెలిపింది. రివ్యూ ఇచ్చేవారికి ఏం అర్హత ఉందని రివ్యూ చెప్పడానికి, హాలీవుడ్‌లో రివ్యూ ఇచ్చే వారికి ఓ అర్హత ఉంటుంది. దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ మన దగ్గర ఎవరికి ఏ అర్హత ఉంది. ఇంట్లో కూర్చొని వచ్చి సినిమా చూసి ఇవాళ్ల నేను రివ్యూ పెడతా అని పెడుతుంటారు. అసలు ఎవరు వాళ్లు, వాళ్లకి ఉన్న అర్హతలేంటి? సినిమా గురించి ఏం తెలుసు, చెప్పడానికి రైట్స్ ఏముంది? అని ఫైర్‌ అయ్యింది. అంతేకాదు ఎవరైనా నా వద్దకు వచ్చి రివ్యూ చూశారా? అని అడిగితే నాకు కోపం వస్తుందని చెప్పింది. 

 

సినిమా చూశారా? మీకు నచ్చిందా? నచ్చిందా లేదా అనేది ఆడియెన్స్ నిర్ణయం. సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో ఇండస్ట్రీలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. అది ఈజీ కాదు, సినిమా రిలీజ్‌ అయ్యాక కొంత సమయం ఇవ్వండి, ఓ ఐదు రోజులైనా గ్యాప్‌ ఇవ్వండి. ఆడియెన్స్ డిసైడ్‌ చేసుకుంటారు. కానీ ముందే ఆడియెన్స్ మైండ్‌లోకి నెగటివ్‌ని ఇంజెక్ట్ చేస్తారు, సినిమాకి రావాలనే ఇంట్రెస్ట్ ని కూడా తొక్కేస్తుంటారు. అలాగని సినిమాలే ఆపేస్తే ఏం చేస్తారు ఒకసారి ఆలోచించాలి. కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, మంచి రివ్యూలు ఉంటాయి, కానీ మిగిలిన సినిమాల గురించి ఆలోచించాలి అని తెలిపింది వరలక్ష్మి శరత్‌ కుమార్. వ్యూవర్స్ కోసం నెగటివ్‌గా చెప్పొద్దని వెల్లడించింది. `శబరి` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి ఈ విషయాలను పంచుకుంది. 

 

`శబరి` సినిమా గురించి చెబుతూ, తల్లికూతుళ్ల స్టోరీతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా సాగుతుందని, సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్ అనిచెప్పింది. స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంది. అయితే తల్లిగా నటించడం గురించి చెబుతూ, తాను మొదట్లోనే తల్లిగా నటించానని, నటిగా తనకు రిస్క్ గా భావించడం లేదని తెలిపింది. రిస్క్ అన్నింటిలోనూ ఉంటుంది, లైఫే రిస్క్, రిస్క్ చేస్తేనే ముందుకు వెళ్తాం అని పేర్కొంది వరలక్ష్మి. `హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది` అని వెల్లడించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. 

2024-04-24T17:55:21Z dg43tfdfdgfd