మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ

మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా మెడి9 తన ఇంటిగ్రేటెడ్​ మెడికల్ ​సిస్టమ్స్​ లోగోను ఆవిష్కరించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన ఈ కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్లు రమణ రాజు, వరలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంత డబ్బు, హోదా ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృథా అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం సూక్తిని ప్రేరణగా తీసుకుని మెడి9 హోమియోపతి, ఆయుర్వేద చికిత్స అందిస్తోందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్​మెడికల్​సిస్టమ్ లక్ష్యం  వ్యాధి లేదా లక్షణంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, పేషెంట్ మనస్సు, శరీరానికి చికిత్స చేయడం అన్నారు. ఈ ప్రాసెస్​సమగ్ర శరీర సంరక్షణకు దారి తీస్తుందన్నారు. గతంలో 50 ఏండ్లకు వచ్చే డయాబెటిస్, కీళ్ల నొప్పులు, థైరాయిడ్, గుండె, లివర్ సంబంధిత వ్యాధులు 20–-30 ఏండ్ల లోపే వస్తున్నాయన్నారు. వీటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలని తెలిపారు. మెడి9లో చికిత్స అంటే ఇంట్లోనే తీసుకుంటన్నట్లు ఉంటుందన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T03:33:23Z dg43tfdfdgfd