మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా కనిపించినా.. కోల్డ్ వార్ నడిచే హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి- మొహన్ బాబు ముందు కనిపిస్తారు. వారు ఎంత మంచిగా ఉన్నా.. ఎప్పటికప్పుడు పోటీనే కనిపిస్తుంది. ఇక గతంలో మోహాన్ బాబు వల్ల మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యిందని మీకు తెలుసా..? 

మెగాస్టార్ చిరంజీవి - మంచు మోహన్ బాబు మద్య ఎంత మంచి స్నేహం ఉందో.. అంతే పోటీ తత్వం కూడా ఉంది. ఇద్దరికి ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. బయట హగ్ చేసుకుని ఎంత మంచిగ ఉన్నా.. కొన్ని విషయాల్లో వీరి మధ్య విభేదాలు కనిపిస్తూనే ఉంటాయి. లాస్ట్ టైమ్ మా ఎలక్షన్స్ లో  ఇవి బహిరంగంగానే బయటపడ్డాయి. 

ఇక గతంలో వీరి సినిమాల మద్య కూడా పోటీ గట్టిగా ఉండేదట. హీరోలలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగినా.. అటు లెజెండరీ యాక్టర్ గా మోహన్ బాబు కూడా చిరంజీవి సినిమాలకు గట్టి పోటీ ఇచ్చిన రోజులు ఉన్నాయట. అంతే కాదు మోహాన్ బాబు దెబ్బకు చిరంజీవిసినిమా డిజాస్టర్ అయిన సందర్భం ఒకటి ఉంది. అదేంటంటే..? 

అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

మోహాన్ బాబు  హీరోగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  పెద్ద రాయుడు. ఈసినిమా అప్పట్లో ఎంత సంచలనంగా మారిందతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 ఏళ్ళ క్రితం వచ్చిన ఈసినిమా దెబ్బకి రికార్డ్ లు బ్రేక్ అయ్యాయి. పెదరాయుడిగా మోహాన్ బాబు పాత్ర.. ఎంత మంది ట్రై చేసినా.. ఆయనంత పర్ఫెక్ట్ గా చేయలేకపోయారు. అంతే కాదు ఈసినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్న 20 నిమిషాలు హైలెట్ అని చెప్పాలి. 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

అంతే కాదు... సినిమాలో డైలాగ్స్.. సాంగ్స్, పెదరాయుడు వచ్చే టైమ్ లో వచ్చే బ్యాగ్రౌండ్  మ్యూజిక్.. సెంటిమెంట్, ఇలా ప్రతీ ఒక్క అంశం సినిమా విజయానికి దారితీశాయని చెప్పాలి. అసలు ఈసినిమా తమిళంలో ముందుగా తెరకెక్కించారు. అయితే అప్పుడు రజనీకాంత్ సలహాతో మోహాన్ బాబు ఈసినిమా హక్కులని కొనుగోలు చేశారు. తానే స్వయంగా నిర్మాతగా మారి ఈమూవీని నిర్మించాడు. మోహన్ బాబు తెలివిగా రజినీకాంత్ ను ఈసినిమాలో ఇన్వాల్వ్ చేయడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది పెదరాయుడు. ఈసినిమా ఓపెనింగ్ కు అన్నగారు ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టారు. 

ఇక ఇదే టైమ్ లో.. పెదరాయుడు సినిమాకు పోటీగా మెగాస్టార్ నుంచి బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయ్యింది. కాని ఆ సినిమా చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. 1995 జూన్ 15న ఈరెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యాయి. పెద్ద రాయుడు సినిమా రిలీజ్ అయ్యే వరకూ పెద్దగా అంచనాలు లేవు. చిరంజీవి సినిమా మాత్రం భారీ అంచనాలతో  విడుదల అయింది. దాంతో పెదరాయుడు సినిమా పని అయిపోయింది అనుకున్నారు అంతా. 

 

అనుకున్నట్టే పెదరాయుడు సినిమాకు పెద్దగా  స్పందన రాలేదు ముందు. కాని రాను రాను  ఆశ్చర్యకరంగా పెదరాయుడు సినిమా చిన్నగా పుంజుకుంది.  బిగ్ బాస్ మూవీ కంటే పెద్ద రాయుడు సినిమాకి మంచి క్రేజ్ రావడంతో థియేటర్లు పెరిగిన టికెట్లు కోసం జనాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రింట్ల సంఖ్య కూడా భారీగా పెంచారు. సినిమాకి వచ్చిన డబ్బులు లెక్కపెట్టుకోవడానికి మిషన్లు కావాలి అనేంతగా కలెక్షన్లు వచ్చాయట. 

   

ఇక అప్పటి వరకూ ఉన్న రికార్డ్ లు కూడా బ్రేక్ చేసిందట పెదరాయుడు సినిమా. అప్పటిదాకా ఘరానా మొగుడు మూవీ పై ఉన్న రికార్డులన్నీ కూడా తిరిగి రాయడంతో పాటు ఈ సినిమా 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడి..  శతదినోత్సవం జరుపుకుంది. ఈసినిమాలో నటించిన సౌందర్యకు హీరోయిన్ గా ప్లస్ అయ్యింది పెదరాయుడు. ఇలా మోహన్ బాబు సినిమా దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి సినిమా  ప్లాప్ అయ్యింది. 

2024-05-07T10:29:41Z dg43tfdfdgfd