రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది?

రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది?

2014 లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని కేసీఆర్​కు అప్పగించారు. కానీ ఆయన రూ.​7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్ తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్లిండు. నాగార్జునసాగర్, శ్రీశైలం. ఎస్సారెస్పీ, జూరాల ఇలా..రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తుండు. నీళ్లులేవు.. నిధులు లేవు.. రెండింటినీ ఊడ్చి, ఎండబెట్టి, ఆరబెట్టిండు.  మేం అప్పులు, వడ్డీలకే రూ. 27 వేల కోట్లు కట్టినం.. జీతాలు ఇచ్చినం.. పెన్షన్లు ఇచ్చినం.. రైతు బంధు ఇచ్చినం..30 వేల ఉద్యోగాలు ఇచ్చినం.. అన్ని శాఖలను సమన్వయం చేసినం.

ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నం. జూన్ లో  ఫుల్ బడ్జెట్ పెడతం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తయి?  రాష్ట్ర ఆదాయం ఎంత? చూసుకుంటం. అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. రైతులపై 30 వేల కోట్ల  నుంచి 31 వేల కోట్ల వరకు రుణం ఉన్నదని ప్రాథమిక అంచనా. రైతులు బ్యాంక్ ల నుంచి తీసుకున్న లోన్లకు ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతలవారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు రూ. 30 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైమ్ ఇవ్వకుంటే ఎలా?.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా.. ఇది మా ప్రభుత్వ గ్యారెంటీ.

©️ VIL Media Pvt Ltd.

2024-04-29T03:17:45Z dg43tfdfdgfd