రామయ్య తండ్రి భద్రాద్రి లో వెలిసినట్లు మొదటగా చెప్పిన మహా భక్తురాలు ఎవరంటే ?

ఆలయాలలో భగవంతుడికి నిత్యం చేసే ఆరాధన సమయంలో ఐదు పాత్రలు వినియోగిస్తారు. వాటికి పంచపాత్రలని పేరు. ఇందులో తీర్థంతోనే స్వామికి పరిపూర్ణమైన ఆరాధన చేస్తారు. అర్ఘ్యపాత్ర, పాద్యపాత్ర. ఆచమనీయపాత్ర. స్నానపాత్ర. శుద్దోకపాత్రతో ఎలాగైతే ఆరాధన సమగ్రంగా ఉంటుందో అలాగే భద్రాద్రి రాముని ఆరాధనలో కూడా ఇంత పరిపుష్టం కావడానికి ఆ ఐదుగురు మహాభక్తుల పాత్రలు పంచపాత్రలుగా ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నాయి. ఆ ఐదుగురే భద్రమహర్షి, పోకల దమ్మక్క భక్త రామదాసు, తానీషా, తూము నరసింహదాసు. వీరి వల్లే భద్రాద్రికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఖ్యాతి చేకూరింది. భద్రాద్రి ఆలయాభివృద్ధిలో వీరి సేవలు అమూల్యమైనవి. ఈ నేపథ్యంలో సదరు మహా భక్తుల ప్రస్థానం మరియు భద్రాద్రి ఆలయంలో సదరు మహా భక్తులు స్వామివారికి చేసిన సేవలు తదితర అంశాలపై భద్రాద్రి దేవస్థానంలో ఆలయ రామాయణ పారాయణాదారునిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమాచార్యులు లోకల్ 18 తో ముచ్చటించారు. ఆయన తెలిపిన పలు ఆసక్తికర విషయాలు మీ... కోసం.

భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పూర్వం నుంచి అనేక మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.‌ వారిలో ముఖ్యంగా భద్ర మహర్షి, పోకల దమ్మక్క, భక్త రామదాసు, తానిషా, తూము లక్ష్మీనరసింహదాసు ప్రధానమైన వారిగా చెప్పుకోవచ్చు.‌ రామ దర్శనం కోసం కఠోర తపస్సును చేసే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని రామ అవతారంలో దర్శించుకున్న మహా భక్తుడు భద్ర మహర్షి. ఆయన కోరిక మేరకు శ్రీమన్నారాయణ రామ అవతార అనంతరం తిరిగి చతుర్భుజాలతో భద్రాచల క్షేత్రంలో సాక్షాత్కరించారు.

భక్తుడైన భద్రుడిని శిలగా మార్చిశిరస్సుపై వెలిశారు. భద్రుని తపస్సు ఫలితంగానే భద్రాద్రి క్షేత్రం ఆవిర్భవించినట్లు పురాణ గ్రంధాలలో సైతం తెలుపబడుతుంది. అందుకే భద్రుడు భద్రాద్రి ఆలయంలో ప్రధమ భక్తుడుగా పేర్కొనవచ్చు. ఇకపోతే పోకలదమ్మక్క16వ శతాబ్దంలో పుట్టలో ఉన్న రాముడిని పోకల దమ్మక్క చూడటం జరిగిందని భద్రాద్రి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ మహా భక్తురాలు ప్రతి నిత్యం స్వామి వారికి అడవిలో లభించే ఫలాలను నైవేద్యంగా సమర్పించేది.

Inter: స్వీపర్ కూతురు.. ఇంటర్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్...

ఈ క్రమంలో ఆమె రాముని పాదాలను కడిగేది. ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రాంతంలో రాములవారు వెలిశారని మొట్టమొదటిగా ఈ లోకానికి చాటి చెప్పిన మహిళ పోకల దమ్మక్క.‌ అందుకే భద్రాద్రి రాముని సేవలో తరించిన మహా భక్తురాలుగా పోకల దమ్మక్క చరిత్ర ఎక్కింది. ఇదిలా ఉండగా కంచర్ల గోపన్న. ఈ ప్రాంతానికి తహసిల్దార్ గా వచ్చిన కంచర్ల గోపన్న అనంతరం భద్రాద్రి రామునికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి. ప్రభుత్వ సొమ్ముతో సుమారు ఆరు లక్షల వెండి నాణాలను వెచ్చించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పలు బంగారు ఆభరణాలను సైతం చేసి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే నేటికీ భద్రాద్రి అంటే భక్త రామదాసు గుర్తుకొస్తారు. అందుకే రామదాసుని సైతం మహా భక్తుడుగా పేర్కొనవచ్చు.

టెన్త్ లో 10 కి 10.. ఇంటర్ లోనూ బెస్ట్ మార్క్స్ సాధించిన ట్విన్స్

ఇకపోతే తానిషా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తానీషా రామచంద్ర మహాప్రభు వారి దివ్యదర్శనాన్ని పొందిన మహనీయుడు.‌ నాడుభక్తరామదాసును బందీఖానాలో బంధించిన అనంతరం రామోజీ, లక్ష్మీజీలుగా రామ లక్ష్మణులు వెళ్లి తానీషాకు దర్శనమివ్వడం, 6 లక్షల బంగారు రామమాడాలు ఇచ్చారు. దీంతో ఏ సంప్రదాయస్తుడైనా రాముని సాక్షాత్కరం పొందడంతో తానీషా శరీరమంతా పవిత్రమైంది. రాముని కటాక్షంతో పూర్తిగా స్నానం చేయబడి పూర్వజన్మ సుకృతం వలన చరిత్రలోనే ఎంతో ఘన కీర్తిని సాధించారు. ఇక మరో భక్తుడు రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు ఎన్నో ఒడిదుడుకులు ఉంటే సరి చేసి ఆలయాన్ని అభివృద్ధిపథంలో నడిపి రామదాసు ఆశయాలను నెరవేర్చారు. ఆగమ, వైష్ణవ సంప్రదాయాలను కొనసాగించి పది రకాల ఉత్సవాల సంకీర్తనలతో ఆరాధనలు జరిగేటట్లు చేశారు. ఈ ఐదుగురు భక్తుల విశేష సేవల వలన భద్రాద్రి ఆలయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని కృష్ణమాచార్యులు తెలియజేశారు.

2024-04-27T11:10:35Z dg43tfdfdgfd