రాయ్‌‌‌‌బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో

రాయ్‌‌‌‌బరేలీ నుంచి పోటీకి  వరుణ్ గాంధీ నో

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లోని రాయ్‌‌బరేలీ లోక్‌‌స భ స్థానం నుంచి పోటీ చేయాలన్న బీజేపీ ప్రతి పాదనకు ఆ పార్టీ నేత వరుణ్ గాంధీ నో చెప్పా రు. గత లోక్ సభ ఎన్నికల్లో పిలిభిత్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన వరుణ్ గాంధీ కి ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయ్‌‌బరేలీ లోక్‌‌సభ స్థానం నుంచి వరుణ్ ​గాంధీని బరిలోకి దించాలని భావించింది.

మరోవైపు, సోనియా కుమార్తె, ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ప్రియాంకపై పోటీ చేయాలని వరుణ్ గాంధీకి బీజేపీ సూచించింది. అయితే, తన సోదరి ప్రియాంకపై పోటీ చేసేందుకు వరుణ్ నో చెప్పారు. కాంగ్రెస్ మాజీ చీఫ్​ సోనియా గాంధీ రాయ్​బరేలీలో వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. రాయ్​బరేలీతో పాటు అమేథీ స్థానానికి కాంగ్రెస్​ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T03:39:54Z dg43tfdfdgfd