రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. 

వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 13న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న పవిత్ర కొన్ని రోజులు ఊరిలో ఉన్నారు. అనంతరం శనివారం తిరిగి హైదరాబాద్ కి బయలు దేరింది.  నెల్లూరు జిల్లా ఉప్పలపాడు వద్ద తన కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. దాంతో పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్ళింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. 

పవిత్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినట్లు పవిత్ర తెలియజేశారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ విషయం తెలియజేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణాన్ని తట్టుకోలేని ప్రియుడు చంద్రకాంత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. 

   

2024-05-19T13:12:27Z dg43tfdfdgfd