లంబోర్గిని కారెక్కి యువతి డాన్స్.. పగిలిపోయిన విండ్‌షీల్డ్.. వీడియో వైరల్

లంబోర్గిని కారు ధర మినిమం రూ.4 కోట్లు ఉంటుంది. ఆ కారులోని ప్రతీ పార్టూ ఖరీదైనదే. ఆ కారు విండ్ షీల్డ్ ఖరీదు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల దాకా ఉంటుంది. అలాంటి విండ్ షీల్ట్‌ ఒక్క రీల్‌ వీడియోతో నాశనమైంది. సోషల్ మీడియాలో ఎలాగొలా ఫేమ్ తెచ్చుకోవాలని కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఓ యువతి టిక్ టాక్ వీడియో చేసేందుకు మరే ప్లేసూ దొరకనట్లు లంబోర్గిని కారు ఎక్కింది. అలా ఎక్కేటప్పుడు కారు విండ్ షీల్డ్‌పై అడుగులు వేస్తూ పైకి వెళ్లింది. ఆమె బరువుకి.. విండ్ షీల్డ్ పగిలిపోయింది. అయినా ఆ యువతి ఏమీ జరగనట్లుగా.. కారుపైన డాన్స్ చేసింది.

ఈ వీడియోని రెడ్డిట్ యూజర్ EthanthegamerGD పోస్ట్ చెయ్యగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. "వ్యూస్, లైక్స్ కోసం ఎందుకిలా చేస్తారు" అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఆ యువతి ఓ టిక్ టాకర్ అని తెలిసింది. టిక్ టాక్ వీడియో కోసమే ఆమె ఇలా చేసిందని తెలిసింది. ఐతే, ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

ఈ టిక్ టాక్ యూజర్ పేరు @snowbunnyjelly. ఆమె ఇది వరకు కూడా ఇలాంటి చాలా వీడియోలు చేసింది. కార్లుపై డాన్సులు చేసింది. అలాగే.. రూఫ్స్ పై నుంచి కిందకు దూకింది. తాజా వీడియోపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

ఈ వీడియో నాకు బాధ కలిగించింది. అంత ఖరీదైన కారును నాశనం చేసింది అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. ఆ కారు విండో అంత తేలిగ్గా ఎలా పగిలిపోయింది. ఆమె బరువును అది మొయ్యలేకపోయిందా అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. కొంత మంది యూజర్లు ఈ వీడియోలో కారు అద్దం పగలడం అనేది గ్రాఫిక్ కావచ్చు అంటున్నారు.

విండ్ షీల్డ్ పగిలినా.. ఏమీ పగలనట్లు ఎలా చేస్తుందో అని ఓ యూజర్ ఆశ్చర్యపోగా.. ఆమెకు అంత అటెన్షన్ అవసరం లేదు. ఆమెను పట్టించుకోకపోతే, ఫేడ్ అవుట్ అవుతుంది అని మరో యూజర్ స్పందించారు. ఆమె ముఖాన్ని చూస్తే అర్థమవుతోంది.. విండ్ షీల్డ్‌ని ఆమె చూస్తోంది అని మరో యూజర్ కామెంట్ రాశారు. ఆమె బరువు అంతా కలిపి 40 కేజీలు ఉంటుంది.. ఆ మాత్రానికే విండ్ షీల్డ్ పగిలిపోతే ఎలా అని మరో యూజర్ ప్రశ్నించారు.

2024-04-19T05:20:08Z dg43tfdfdgfd