వాళ్ల గర్ల్ ప్రెండ్ ని హీరోయిన్ గా పెట్టుకోవటం కోసం నన్ను తీసేసారు, అవమానం, బాథ

కెరీర్ ప్రారంభం రోజుల్లో ప్రియాంక్ తనకంటూ గాడ్ ఫాదర్ అండ లేక చాలా ఇబ్బందులు పడింది. అయితే మెల్లి మెల్లిగా ...

సినిమా ఇండస్ట్రీ  రకరకాల లెక్కలతో నడుస్తూంటుంది. ఒకరికి సినిమా ఆఫర్ రావటం లేదా రిజెక్ట్ అవ్వటం వెనక రకరకాల రీజన్స్ ఉంటాయి. కేవలం ప్రతిభ అనే మనం బయిట నుంచి చూసి డిసైడ్ అవ్వాల్సిన పనిలేదు. అయితే అసలు నిజాలు ఎవరూ చెప్పటానికి ఇష్టపడరు కాబట్టి బయిటకి రావు. అయితే అప్పుడప్పుడూ ప్రియాంక చోప్రా వంటివారు నోరు విప్పుతారు. కొన్ని షాకింగ్ నిజాలు బయిటపెడతారు.

 

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా  సినీ పరిశ్రమలో  తను ఎదుర్కొన్న రిజెక్షన్స్ గురించి చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు కూడా రివీల్ చేసింది. ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్ హెడ్ ఆఫ్ స్టేట్ షూట్‌లో బిజీగా ఉన్న ప్రియాంక మీడియాతో మాట్లాడింది.ప్రియాంక, పోడ్‌కాస్ట్‌లో, తాను ఎప్పుడూ రిజక్షన్స్ ఎదుర్కొంటూనే ఉన్నానని, అప్పుడు ఆ క్షణం అది   'కష్టం' అనిపిస్తుందని  చెప్పింది.  అయితే రిజెక్షన్స్ నుంచి బయిటపడలాంటే తను ఎదిగి చూపించటమే అని నమ్మానని అంది. అయితే తనను ఏ సినిమా నుంచి ఏ డైరక్టర్ తీసేసారనేది మాత్రం చెప్పలేదు. 

కెరీర్ ప్రారంభం రోజుల్లో ప్రియాంక్ తనకంటూ గాడ్ ఫాదర్ అండ లేక చాలా ఇబ్బందులు పడింది. అయితే మెల్లి మెల్లిగా ఆమె టాలెంట్ ని  ప్రపంచమే ఇష్టపడింది. నెత్తిన పెట్టుకుంది. హాలివుడ్‌ సైతం ఆమెకు దాసోహమంది. తన కంటే పదేళ్లు చిన్నవాడయినా నిక్ జోనస్‌ను ప్రేమించి..పెళ్లిచేసుకుంది ప్రియాంక.  

 

బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలోనే హాలీవుడ్ లో అడుగుపెట్టి తన సత్తా చాటుకున్న ప్రియాంక చోప్రా..నిక్ జోనస్‌ ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది.

 ప్రస్తుతం కాపురం చేస్తూనే మరోపక్క పలు సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది.

ప్రియాంకకు పదో తరగతిలోనే ఓ లవ్ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని తన ఆత్మకథ 'అన్ ఫినిష్డ్'లో ప్రస్తావించింది. అన్ ఫినిష్డ్ పేరుతో ఓ బుక్ రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా.. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను, తీపి, చేదు జ్ఞాపకాలను వెల్లడించింది. ఈ పుస్తకం ద్వారా లైఫ్‌ సీక్రెట్స్ బయటపెడుతూ అన్ని విషయాలపై ఓపెన్ అయింది.

ఇందులో భాగంగానే తన చిన్నతనంలో చేసిన ఓ చిలిపి పనిని ఈ బుక్‌‌‌‌లో రాసుకొచ్చింది ప్రియాంక. తాను పదో తరగతిలోనే ప్రేమలో పడి ఓ వ్యక్తితో రొమాన్స్ చేసినట్లు పేర్కొంటూ ఆ సందర్భాన్ని వివరించింది.

పదో తరగతిలో బాబ్ అనే అబ్బాయి చలాకీతనం తనం చూసి పడిపోయా. ఫన్నీ చేష్టలతో ఎప్పుడూ నవ్వించే అతనితో ప్రేమలో పడిపోయా. అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అని చెప్పిన ప్రియాంక.. ఓ రోజు ఇంట్లో తన బాయ్ ప్రెండ్‌‌‌‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాననే విషయాన్ని రివీల్ చేసింది.

ఇంట్లో ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడని, ఇద్దరం కలిసి టీవీ చూస్తుండగా సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోనే దాచి పెట్టానని, కానీ అది మా ఆంటీ పసిగట్టి అమ్మకు చెప్పిందని ప్రియాంక తన పుస్తకంలో పేర్కొంది. దీంతో ప్రియాంక చెప్పిన ఈ మెమరబుల్ మూమెంట్ జనాల్లో చర్చనీయాంశం అయింది.

ఇక ఆమె డ్రస్ సెన్స్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. గతంలో  తన బ్రెస్ట్ ని ఎక్సపోజ్ చేస్తూ ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రస్ పై విమర్శలు కురిపించారు సోషల్ మీడియా జనం. ఇండియాని ఆమె రిప్రజెంట్ చేస్తుందనే విషయం మర్చిపోయి ఆమె ఇలాంటి డ్రస్ వేసుకోవటం పద్దతి కాదంటున్నారు.

అయితే అదే సమయంలో ఆమె గ్లోబుల్ స్టార్ అని, ఆమెకు నచ్చిన డ్రస్ వేసుకునే స్వాతంత్ర్యం ఆమెకు ఉందని , ఆమె ఇంకా ఇండియాని రిప్రజెంట్ చేస్తోందని ఊహిస్తూ బాధపడటం భ్రమ అని మరికొందరు ఆమెకు సపోర్ట్ చేసారు.

 

వాస్తవానికి ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. అదే ఆమెకు ఈ రకమైన ట్రోలింగ్ ని తెచ్చిపెడుతోంది. అన్ని అందరినీ మెప్పించలేవు అని మరికొందరు ఈ విషయాన్ని విశ్లేషిస్తున్నారు.

సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్‌ లేకుండా ఒంటరిగా కెరీర్‌ మొదలుపెట్టారు ప్రియాంకా చోప్రా. ‘‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని, దానికి కారణం ఇతరుల మీద ఆధారపడటమే’’ అని అంటూ ఆ రోజులును గుర్తు చేసుకుంటారామె.

 

ఇతరులపై ఆధారపడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఒత్తిడి నాపై కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడికి భయపడే స్థాయిలో నేను లేను. సినిమాల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా ఒత్తిడి మాయమైపోయింది అంటారామె. 

2024-04-28T09:40:16Z dg43tfdfdgfd