విజయ్ మాల్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

విజయ్ మాల్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

రూ.180 కోట్ల బ్యాంకు లోన్లు ఎగవేత కేసులో పరారీలో ఉన్న విజయ్ మాల్యాపై ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 29లోపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తీసుకున్న లోన్లు చెల్లించనందుకు ఈ చర్యలు తీసుకుంది.

  2007 నుంచి 2012 వరకు విజయ మాల్యకు చెందిన కంపెనీ ముంబైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్  నుంచి 180కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగవేసింది. తిరిగి గడవులోగా చెల్లించకపోవడంతో 2016 ఆగస్టులో విజయ మాల్యతో పాటు 10మందిపై కేసులు రిజిస్టర్ చేశారు. మిగతా నిందితులందరూ కోర్టులో హాజరుకాగా.. విజయమాల్య అటెండ్ కాకపోవడంతో సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

ప్రస్తుతం విజయ్ మాల్యా  లండన్‌లో నివసిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ..  పరారీలో ఉన్న మాల్యాను ఇప్పటికే ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మాల్యాను ఇండియాకు రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయ్నతిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.

2024-07-02T05:20:09Z dg43tfdfdgfd