శివుడి పాత్ర వేసిన ఈ స్టార్స్ మెడలో అసలైన నాగుపామును ఎందుకు వేసుకోలేదో తెలుసా? పెద్ద లాజిక్కే ఉంది!

త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు పాత్ర చేసే అవకాశం అరుదుగా వస్తుంది. అయితే ఈ పాత్ర చేసిన ఎన్టీఆర్, చిరంజీవి, రజినీకాంత్ వంటి నటులు మెడలో లోహపు నాగరాజును వాడాడు. నిజమైన పామును వేసుకోలేదు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది.. 

 

లార్డ్ శివ క్లిష్టమైన పాత్ర. ఈ క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. శివుడు అనగానే ఒక మంచి భర్త, దుష్ట సంహారి, భోళా గుణం, ఆత్మాభిమానం, నిరాడంబరత... ఇలా అనేక పార్శ్వాలు గుర్తుకు వస్తాయి. విలక్షణతను మించి... గెటప్ కూడా చాలా కష్టం. ముఖ్యంగా శివ పాత్రధారి మెడలో నాగరాజును ధరించాలి. 

 

అయితే చాలా మంది నటులు నిజమైన నాగుపామును ధరించరు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైన ఎన్టీఆర్.. ఉమా చండి గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం చిత్రాల్లో శివుడు పాత్ర చేశారు. ఆయన మెడలో లోహపు నాగరాజును ధరించారు. 

 

అలాగే చిరంజీవి శ్రీ మంజునాథ చిత్రంలో శివుడిగా నటించి మెప్పించారు. అలాగే ఆపద్బాంధవుడు చిత్రంలో శివుడిగా కనిపించారు. ఈ రెండు చిత్రాల్లో చిరంజీవి మెడలో బొమ్మ పామునే ధరించారు. నిజమైన నాగుపాము జోలికి పోలేదు.

 

రజినీకాంత్ 1993లో విడుదలైన ఉజైప్పలి అనే తమిళ చిత్రంలో లార్డ్ శివ గెటప్ వేశాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి రజినీకాంత్ శివుడి గెటప్ వేసి వాళ్ళను మోసం చేయాలి అనుకుంటాడు. రజినీకాంత్ కూడా బొమ్మ పామునే అప్పుడు ఉపయోగించారు.

   

కమల్ హాసన్ బ్రహ్మచారి చిత్రంలో శివుడి పాత్ర చేశాడు. ఓ కామెడీ సన్నివేశం కోసం ఆయన ఆ పాత్రలో కనిపించాడు. ఆయన మాత్రం నిజమైన పామునే మెడలో వేసుకున్నాడు. శివుడి పాత్ర చేసిన కొందరు నటులు గతంలో నిజమైన పామును మెడలో ధరించారు. 

 

అయితే చాలా సినిమాల్లో లోహపు లేదా బొమ్మ నాగుపాములను ఉపయోగిస్తారు. దీనికి ప్రధాన కారణం... టైం సేవ్ చేయడానికి. నిజమైన పాము మెడలో సరిగా ఉండదు. షాట్ రెడీ అయ్యాక  పాము సరైన పొజిషన్ లో లేకుండా అటూ ఇటూ పోతుంటే షూటింగ్ ముందుకు సాగదు. నటులు కూడా దృష్టి పెట్టలేరు. కొందరు కంపరంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. 

 

భయంతో కొందరు నటులు నిజమైన పామును ధరించాడనికి ఇష్టపడరు. ట్రైనింగ్ ఇచ్చిన పాములు సకాలంలో అందుబాటులో ఉండవు. దానికి తోడు ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోయాయి. నిజమైన పామును వాడితే అది నేరం. కేవలం సీజీలో రూపొందించాలి. లేదంటే బొమ్మ పాము వాడుకోవాలి. లేదంటే సెన్సార్ సభ్యులు అబ్జెక్షన్ పెడతారు. 

 

ఇండియాలో అనేక జంతు సంరక్షణ చట్టాలు వచ్చాయి. వాటి ప్రకారం సినిమా షూటింగ్స్ కోసం పాములను, జంతువులను హింసిస్తే నేరం. అందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి... శివుడు పాత్రధారి ఎవరైనా నిజమైన పామును మెడలో వేసుకోవడానికి వీల్లేదు... 

2024-03-29T11:46:28Z dg43tfdfdgfd