శ్రీమహావిష్ణువు పదో అవతారం కల్కి కథ తెలుసా..? ఆ అవతారం రాక ఎప్పుడు..?

Kalki Avatar: శ్రీ భాగవత పురాణం - కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం (Kalki Avatar) అనేది శ్రీమహావిష్ణువు పదవ, చివరి అవతారం. ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు. కానీ కలి యుగం (Kali Yug) ముగిశాక స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతాడని, సత్య యుగాన్ని (Satya Yug) ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు. కల్కి అవతారంలో స్వామి వారి రాక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని, అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్దిస్తాడు. తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు.

* కల్కి అవతారం కథ

కలియుగం నాలుగు యుగాలలో చివరిది. హిందూ విశ్వశాస్త్రం ప్రకారం ఈ నాలుగు యుగాలు (సత్య, త్రేతా, ద్వాపర, కలి) చక్రంలా తిరుగుతూ ఉంటాయి. పురాణాల ప్రకారం రుషి భృగు (Bhrigu) భార్య అసురులను (రాక్షసులను) దేవతల నుంచి రక్షిస్తుంది. ఆ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన శ్రీమహావిష్ణువు ఆమెను చంపేశాడు. ఈ చేదు వార్త తెలిసి భృగు రుషి విష్ణువును శపించాడు. ఆ శాపం వల్ల విష్ణు మానవుడిగా జన్మిస్తాడు. ప్రియమైన వారి నుంచి విడిపోయి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. ఈ శాపం వల్లే విష్ణువు భూమిపై దిగి దుష్ట శక్తులతో పోరాడుతూ, ప్రజలకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు. కల్కి అవతారం కూడా ఈ శాపంలోనే భాగమే.

Heat Stroke: వడదెబ్బ తగిలిన వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ అవసరం..? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

* కల్కి అవతారం ఎవరు?

పురాణాల ప్రకారం కలియుగం ముగిసే సమయంలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు. సనాతన ధర్మం ప్రకారం కల్కి అవతారంలో విష్ణు భగవానుడు భూమిపై ఉన్న పాపులను నాశనం చేసి, ధర్మ మార్గాన్ని స్థాపిస్తాడు. కల్కి ఒక శక్తివంతమైన యోధుడిగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోధుడు 'దేవదత్త' అనే తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, చెడును నాశనం చేసే ఖడ్గాన్ని ధరిస్తాడు. కల్కి రాకను ప్రపంచంలోని నైతిక పరిస్థితులను సరిదిద్దడానికి అవసరమైన ఒక ప్రళయంగా భావిస్తారు. కల్కి గురించి పురాణ గ్రంథాలలో వివిధ వర్ణనలు ఉన్నాయి. కొన్ని వర్ణనలలో ఆ అవతారాన్ని చెడును నాశనం చేసే అదృశ్య శక్తిగా చిత్రీకరించారు, అలానే దుర్మార్గులను నాశనం చేసే భయంకర రూపంగానూ అభివర్ణించారు.

---- Polls module would be displayed here ----

* కల్కి అవతారం రాక ఎప్పుడు

మత విశ్వాసాల ప్రకారం కలి యుగం క్రీస్తుపూర్వం 3102 కాలంలో ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్లాక కలియుగం మొదటి దశ ప్రారంభమైంది. పురాణాల ప్రకారం కలియుగం భూమిపై 4.32 లక్ష ఏళ్లు ఉంటుంది. అంటే 2024 నాటికి 5,125 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా 4,26,875 ఏళ్లు మిగిలి ఉన్నాయి. కల్కి అవతారం కలి యుగం ముగిసే సమయంలో జన్మిస్తాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం కల్కి శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో ఐదవ రోజున జన్మిస్తాడు. ఆ సమయంలో గురు, సూర్య, చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. కలియుగం ముగిసి సత్య యుగం ప్రారంభమయ్యే సమయంలో కల్కి జన్మిస్తాడు.

* కల్కి అవతారం రాకతో ఏం జరుగుతుంది?

అగ్ని పురాణం 16వ అధ్యాయంలో, కల్కి అవతారం ఒక గుర్రంపై స్వారీ చేసే ఒక బాణాసురుడిగా చిత్రీకరించబడింది. కల్కి 'దేవదత్త' అనే తెల్లని గుర్రంపై వచ్చి పాపులను నాశనం చేస్తాడు. ఈ అవతారం 64 కళలతో కూడి ఉంటుంది. అతని గురువు అమరత్వం పొందిన పరశురామ భగవానుడు. పరశురాముడు మార్గదర్శకత్వంలో కల్కి శివుడిపై ధ్యానం చేసి, అధర్మాన్ని నాశనం చేయడానికి దైవశక్తులను పొందుతాడు. దుష్టశిక్షణ చేసి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేయడమే కల్కి లక్ష్యం.

* కల్కి అవతారం ఎక్కడ జన్మిస్తాడు?

కల్కి పురాణం ప్రకారం కల్కి ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ గ్రామంలో జన్మిస్తాడు. సంభాల్ అనేది మొరాదాబాద్ సమీపంలో ఉన్న ఒక నగరం. ఇది ఇప్పటికే ఒక కల్కి దేవాలయాన్ని కలిగి ఉన్న జిల్లా ప్రధాన కేంద్ర పట్టణం కూడా. కల్కి అవతారం పుట్టుకకు సంబంధించిన వివరణాత్మక కథనం శ్రీమద్భాగవత పురాణంలో ఉంది. ఈ పురాణం ప్రకారం అతను సంభాల్‌లో విష్ణుయాశ అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడు. కల్కి అవతారం జన్మించే ప్రదేశం గురించి కచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు. కానీ కల్కి పురాణం, శ్రీమద్భాగవతం ప్రకారం, కల్కి ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జన్మిస్తాడని నమ్ముతారు.

2024-04-29T13:48:54Z dg43tfdfdgfd