సందీప్ వంగాకు.. అమీర్ మాజీ భార్య స్ట్రాంగ్ కౌంటర్.. ఈ సారి డైరక్ట్ గా సీనే పెట్టిందే

కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని సీన్ ని సోషల్ మీడియా యూజర్లు సందీప్ రెడ్డి వంగాపై వ్యంగ్యంగా పరిగణిస్తున్నారు. 

ఓ చిన్న సినిమాగా రిలీజై.. థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న   మూవీ లాపతా లేడీస్ .. ఓటీటీలోనూ అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. మహిళా సాధికారత అనే అంశాన్ని సరదాగా, ఆలోచింపజేసేలా ఈ మూవీ రూపొందించారు.మే నెల ఫస్ట్  వీకెండ్ లో నెట్‌ఫ్లిక్స్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఉన్న ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. వీటిలో లాపతా లేడీస్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. 

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది. ఈ సినిమాను అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్స్ కు పంపాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 26న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగు పెట్టింది. మరుసటి రోజు నుంచే ఇండియాలో ఈ మూవీ టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. తొలి వారం మొత్తం అదే స్థానంలో కొనసాగుతున్న ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. అదీ సందీప్ వంగాతో..అదెలా అంటే ఈ వివాదానికి మూలం అయిన వివాదం నుంచి మొదలెట్టి మాట్లాడుకోవాలి. 

కొద్ది నెలల క్రితం సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' (Animal) చిత్రం ఎంతగా విజయం సాధించిందో అంతే విమర్శలకూ లోనైంది. తాజాగా ఈ చిత్రం నెట్స్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో వచ్చాక విమర్శలు రెట్టింపు అయ్యాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది మండిపడ్డారు.   అమిర్ ఖాన్‌ (Ameer khan) మాజీ భార్య కిరణ్‌ రావు (Kiran rao) సైతం విమర్శలు సంధించారు. అప్పుడే ఓ చిన్న సైజ్ యుద్దం మొదలైంది.

 

కిరణ్ రావు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్‌ సింగ్‌ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె కామెంట్‌ చేశారు. దీనిపై యానిమల్‌ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కిరణ్‌ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep reddy) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆమె పేరును ప్రస్తావన లేకుండా వ్యంగ్యాస్త్రాలు  సంధించారు. అమిర్‌ ఖాన్‌ నటించిన దిల్‌ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చారు.

సందీప్‌ మాట్లాడుతూ.. ''ఈ రోజు ఉదయం నా ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్) నాకు ఒక ఆర్టికల్ చూపించారు. అవి సూపర్ స్టార్ రెండో మాజీ భార్య చేసిన కామెంట్స్. బాహుబలి 2, కబీర్ సింగ్ లాంటి సినిమాలు స్త్రీ వ్యతిరేకతను, వేధింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె అంటున్నారు. వేధింపులకు, దగ్గరవడానికి మధ్య తేడా ఆమెకు తెలియదని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఈ విషయాలను సందర్భోచితంగా చదివినప్పుడు వారు అంగీకరిస్తారు. ఇది పూర్తిగా తప్పు'' అని సందీప్ రెడ్డి వంగా అన్నాడు.

 

ఇంకా సందీప్ రెడ్డి కొనసాగిస్తూ "నేను కిరణ్ రావ్ గారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడండి. ఆ మూవీలో అమ్మాయిపై రేప్‌కు ప్రేరేపించే సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. అంతా జరిగినా చివరికీ అతడితోనే ఆమె ప్రేమలో పడుతుంది. మరి దీన్ని ఏమంటారు. ఇలాంటివి చూడకుండా ఎలా కామెంట్స్ చేస్తారో అర్థం కావడం లేదు" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ వివాదం కు కంటిన్యూషన్ గా అన్నట్లు ఇప్పుడు మరో వివాదం మొదలైంది.

OTTలో ‘Lapta Ladies’ రావడంతో నెటిజన్లు కొత్త వివాదం రాజేసారు.  ఈ సినిమాలో ఫూల్ కుమారి (నితాన్షి గోయల్) – మంజు బాయి (ఛాయా కదమ్) మధ్య  వచ్చే సంభాషణలు ఉన్నాయి. ఈ సమయంలో, మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో మాట్లాడుతుంది. తన భర్త తనను కొట్టాడని చెప్పింది, దానికి మంజు, ‘నిన్ను ప్రేమించే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది, ఒకరోజు నేను కూడా నా హక్కులను బయట పెట్టాను అని కామెంట్ చేస్తుంది. 

కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని సీన్ ని సోషల్ మీడియా యూజర్లు సందీప్ రెడ్డి వంగాపై వ్యంగ్యంగా పరిగణిస్తున్నారు. నిజానికి ఆయన ‘కబీర్ సింగ్’ సినిమాలో ఓ సీన్ ఉంది. ఇందులో కబీర్ (షాహిద్ కపూర్) ప్రీతి (కియారా అద్వానీ)ని చెంపదెబ్బ కొడతాడు. సినిమాలోని ఈ సీన్ పై అప్పట్లో బాలీవుడ్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, ‘మీరు మీ స్త్రీని ప్రేమించలేకపోతే , మీరు ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు, మీరు ముద్దు పెట్టుకోలేరు. మీరు అసభ్యకరమైన భాషను ఉపయోగించలేరు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ కి కిరణ్ రావు సినిమాలో సీన్ తో కౌంటర్ ఇచ్చారని కామెంట్లు వినపడుతున్నాయి. ఇది మరో వివాదం అయ్యే పరిస్దితి కనపడుతోంది. డైరక్ట్ గా సందీప్ వంగాకు కిరణ్ రావు ఇచ్చిన కౌంటర్ గా చెప్పున్నారు. 

 

 ‘Lapta Ladies’  సినిమా కథేంటి అంటే.. 2001లో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో మొదలవుతుంది.    దీపక్ కుమార్ , పూల కు వివాహం జరుగుతుంది. ఊరికి వెళ్లేందుకు వారు ఓ ట్రైన్ ను ఎక్కుతారు. అయితే అదే ట్రైన్ లో మరొక జంట పూల్ ధరించిన దుస్తులలానే ధరించి ఉంటుంది. వారిద్దరు కూడా పై ముసుగులు ధరించి ఉంటారు. ఈ క్రమంలో రైలు దిగే ముందు తొందరలో ఒకరి భార్యను మరొకరు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.  

2024-05-04T03:47:36Z dg43tfdfdgfd