సూపర్‌ స్టార్‌ని ముళ్ల కంచెలో పడేసిన పోలీస్‌ గుర్రం.. కృష్ణ కెరీర్‌లో అతిపెద్ద బ్యాడ్‌ ఎక్స్ పీరియెన్స్ అదేనా?

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎన్నో సినిమాల్లో యాక్షన్‌ చేశారు. ప్రమాదాల బారిన పడ్డారు. కానీ ఒక్కటి మాత్రం తాను ఎప్పటికీ మర్చిపోలేదట. గుర్రం ముళ్ల కంపలో పడేసిందంటూ షాకిచ్చారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ ప్రయోగాలకు కేరాఫ్‌. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని స్టార్‌ స్టేటస్‌ని దక్కించుకున్న సూపర్‌ స్టార్‌. తెలుగు సినిమా కొత్త పుంతలను తొక్కించడంలో తన పాత్ర కీలకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమాకి ఎన్నో కొత్త టెక్నిక్స్ ని పరిచయం చేసింది ఆయనే. ఆయన చిత్రాలతోనే తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి.

 

ఇదిలా ఉంటే ఈ ప్రయోగాలు చేసే క్రమంలో, సినిమా షూటింగ్‌లో సాహసాలు చేసే క్రమంలో దెబ్బలు తగలడం, గాయాలపాలు కావడం తరచూ జరుగుతుంటాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా గాయపడ్డారు. చాలా సార్లు గాయాలపాలు అయినట్టు చెప్పిన కృష్ణ.. ఓ సందర్భాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. గుర్రం చేసిన పని బయటపెట్టారు. 

 

తెలుగు సినిమాల్లోనే కాదు ఇండియాలోనే కౌబాయ్‌ క్యారెక్టర్‌ చేసింది కృష్ణ. `మోసగాళ్లకి మోసగాళ్లు` అనే చిత్రంలో ఆయన కౌ బాయ్‌ పాత్రని పోషించి మెప్పించారు. ఓ కొత్త అనుభూతిని తెలుగు ఆడియెన్స్ కి ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

 

అయితే ఇందులో తాను దెబ్బతిన్న సంఘటన బయటపెట్టాడు కృష్ణ. `మోసగాళ్లకి మోసగాడు` మూవీ బికినీర్‌లో ఓ డిజర్ట్ లో షూటింగ్‌ చేశారట. ఆ సమయంలో వాళ్లు పోలీస్‌ గుర్రాలను ఉపయోగించారట. ఆ గుర్రాలు చాలా బలంగా ఉన్నాయట. షూట్‌ చేసే సమయంలో అది తీసుకెళ్లి ఓ ముళ్ల కంచెలో పడేసిందట కృష్ణని. ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. 

 

అయితే యాక్షన్‌ మూవీస్‌ చేసేటప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ఉంటాయి. ఐస్‌లో షూట్‌ చేశామని, ఫారెస్ట్ లో, ప్రమాదకర ప్రాంతాల్లోనూ షూటింగ్‌ చేశామని తెలిపారు కృష్ణ. `అల్లూరి సీతారామరాజు`, `దేవదాసు` చిత్రాలకు ఎంతో హోంవర్క్ చేసిన నటించారట. ముఖ్యంగా `అల్లూరి సీతారామరాజు`ని చింతపల్లి అడవుల్లో తీశారట. ఉదయం 4.30గంటల సమయంలో చిత్రీకరించారట. బట్టలు లేకుండా అంత ఉదయాన్నే షూట్‌ చేయడం చాలా కష్టమైందని తెలిపారు. 

 

అయితే అల్లూరి సీతారామరాజు పాత్రపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఏ బాధ అనిపించలేదని, 45 రోజులు మరే సినిమా చేయకుండా కేవలం ఆ ఒక్క మూవీనే చేసినట్టు తెలిపారు కృష్ణ. అన్ని రోజులు ఆ ఫారెస్ట్ లోనే ఉన్నామన్నారు. కానీ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించడంతో ఆ బాధ అంతా మర్చిపోయామని తెలిపారు. అలాగే `దేవదాస్‌` చిత్రానికి సహజత్వం కోసం గెడ్డంతో ఫుడ్‌ తీసుకోకుండా నటించినట్టు తెలిపారు. చాలా కష్టపడ్డాం కానీ ఆడలేదని, విమర్శకుల ప్రశంసలు అందుకుందని తెలిపారు. 1993లో దూరదర్శన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు కృష్ణ. 

ఇక కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన `మోసగాళ్లకి మోసగాడు` మూవీకి కె ఎస్‌ ఆర్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. తన పద్మాలయ పిక్చర్స్ పై నిర్మించారు. ఆదిశేశగిరి రావు నిర్మాత. 1971లో ఈ చిత్రం వచ్చింది. సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. 

2024-05-07T13:30:00Z dg43tfdfdgfd