సూసైడ్ చేసుకోవాలి అనుకున్న రజినీకాంత్.. సూపర్ స్టార్ ఎలా అయ్యాడు..? రహస్యాన్ని స్వయంగా వెళ్లడించిన తలైవా..

సూపర్ స్టార్ రజినీకాంత్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారా..? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది...? సూసైడ్ చేసుకోవాలి అనుకున్న రజినీకాంత్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు..? ఆయనే స్వయంగా వెల్లడించిన విషయాలు ఏంటంటే..?  

 

సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాట మాత్రమే కాదు..  భారతీయ సినిమాకు సూపర్ స్టార్ గా వెలుగొందారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు  రజనీకాంత్. ఆయన సినిమా వచ్చిందంటే ప్యాన్స్ కు పండగే..

 

73 ఏళ్లు వచ్చినా.. కుర్రహీరోలను మించి అభిమానులను అలరిస్తున్నాడు సూపర్ స్టార్.  ఈ ఏజ్ లో కూడా  రజనీ అదే స్టైల్‌తో ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ చేస్తున్నాడు. రజనీ బాక్సాఫీస్ కింగ్ మరియు రికార్డ్ మేకర్ కూడా. కాబట్టి కొత్త రికార్డులు సృష్టించడం లేదా ఉన్న రికార్డులను బద్దలు కొట్టడం నటుడు రజనీకాంత్‌కి కొత్తేమీ కాదు. దీంతో నిర్మాతలు రజనీకాంత్‌కు ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. 

 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

ప్రస్తుతం నటుడు రజనీకాంత్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా నిలిచారు అయితే, రజనీకాంత్  కు సబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుందిత. ఆయన ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నారట. నమ్మడానికి వీలుగా లేకపోయినా.. ఇది నిజం.. అవును నిజమే.. బస్‌ కండక్టర్‌ నుంచి నటుడిగా మారిన రజనీకాంత్‌ తన కష్టాలు, ప్రయాణం గురించి ఒకసారి ఓపెన్‌గా మాట్లాడాడు.

 

ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..

1992లో సింగపూర్‌లో తన భార్య లతా రజనీకాంత్ నిర్వహించిన సంగీత కచేరీకి హాజరైన రజనీకాంత్..  కండక్టర్‌ నుంచి సూపర్ స్టార్ వరకూ  తన జీవితం గురించి మాట్లాడారు.కుటుంబ పేదరికం కారణంగా తాను ఆఫీస్‌ బాయ్‌గా, కూలీగా, కార్పెంటర్‌గా పనిచేశానని రజనీకాంత్‌ చెప్పారు. పేదరికాన్ని తాను ప్రత్యక్షంగా అనుభవించినందుకే తనకు తెలిసిందన్నారు.అయితే తనకు ధనవంతుడు కావాలనే కోరిక, కల ఉందని రజనీకాంత్ ఒప్పుకున్నాడు. 

 

సందీప్ కిషన్‌కు తల్లిగా ప్రభాస్ హీరోయిన్, షాకింగ్ న్యూస్ లో నిజమెంత..?

 

తాను జీవితంలో దేనికి భయపడలేదన్నారు. కాని  ఒకానొక సమయంలో తీవ్ర భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే కొంత మంది దైవాంశ సంభూతులను ఆరాధిస్తూ వేసిన పెయింటింగ్ తన జీవితాన్నే మార్చేసిందని, అది చూసిన తర్వాత తన నిర్ణయాన్ని మరో రోజు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నానని రజనీ తెలిపారు.

 

రజినీకాంత్ అప్పుడు మాట్లాడుతూ... "నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న రోజు నాకు కల వచ్చింది. నా కలలో తెల్లటి గడ్డంతో చిత్రీకరించబడిన పెయింటింగ్‌లోని సాధువు నది అవతల కనిపించి నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశాడు, నేను ఈత కొట్టకుండా అతని వైపు పరుగెత్తాను. మరుసటి రోజు దేవత గురించి విచారించగా అది శ్రీ రాఘవేంద్రుడని తెలుసుకున్నాను. ఆ తర్వాత మఠానికి వెళ్లి ధనవంతులు కావాలనే కోరికను వ్యక్తపరిచి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.. ప్రతి గురువారం ఉపవాస దీక్షను ప్రారంభించాను అన్నారు రజినీకాంత్. 

 

తర్వాత కండక్టర్‌గా అర్హత సాధించాను. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అప్పుడు బాలచందర్ సార్ నన్ను కనిపెట్టి, చివరికి స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాను అని..ఈ విషయాన్ని రజనీకాంత్ తొలిసారిగా బహిరంగంగా వెల్లడించాడు. అంతే కాదు  రజనీకాంత్  1978లో మంత్రాలయ సందర్శనను గుర్తుచేసుకున్నారు. తానకు కలలో కనిపించిన నది మరియు ఆ స్థలం అదే అని అని. అలాంటి ప్రదేశం మరెక్కడా చూడలేదని రజినీకాంత్ అన్నారు. 

 

అలాగే కండక్టర్‌ని సూపర్‌స్టార్‌గా మార్చడంలో తమిళనాడు ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని తాను నమ్ముతున్నానని రజనీ అన్నారు. శ్రీ రాఘవేంద్రునికి నివాళిగా రజనీకాంత్ 1984లో ‘శ్రీ రాఘవేంద్ర’ చిత్రంలో నటించారు. ఇది ఆయనకు 100వ సినిమా కావడం గమనార్హం.

2024-05-10T09:07:34Z dg43tfdfdgfd