సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు.. ఎప్పటినుంచంటే..

రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిలుతున్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రంలో ఏడాది పొడువునా ఉత్సవాలు నిత్య కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా స్వామివారి వ్రతం అంటే తెలుగు లోగిలిలో ఒక పండుగ మాదిరిగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అటువంటి అన్నవరం శ్రీ అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామివార్లు పెద్ద కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాలు చూద్దాం.

అన్నవరం పేరు వింటేనే తెలుగు లోగిలిలో ఒక తెలియని ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. రత్నగిరి కొండపై శ్రీ అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామివార్లు కొలువైన పరమ పావన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. అన్నవరంలో ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు జరిగినప్పటికీ మే మాసంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా దేవస్థానం ప్రతియేటా నిర్వహిస్తూ ఉంటుంది.

ఈ ఏడeది స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి మే 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తుంది. ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి 18వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు స్వామి అమ్మవార్లను పెండ్లి కోడుకు పెండ్లి కుమార్తెగా అలంకరించి ఆధ్యాత్మిక కార్యక్రమం నైనా మనోహరంగా జరగనుంది. అనంతరం 19వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం జరగనుంది.

ఈ మాజీ సర్పంచ్ భూమయ్య.. ఎందరికో ఆదర్శం.. కారణం ఇదే..

20వ తేదీ అన్నవరం రత్నగిరి క్షేత్రంలో హోమాలు 21వ తేదీ పండితసదస్సు 22వతేదీ స్వామి అమ్మవార్ల వనవిహారం. 23వతేదీ నాగబలి. 24వ తేదీ స్వామి అమ్మవార్ల చక్రస్నానం. 25వ తేదీన స్వామి అమ్మవారి శ్రీ పుష్పయాగ కార్యక్రమాలతో కళ్యాణ మహోత్సవం ముగియనుంది.

అయితే ఏ నివాసంలో కళ్యాణం జరిగిన గృహప్రవేశం జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని తెలుగు లోగిల్లో ఆనందంగా ఉంటూ ఉంటారు. అటువంటి సత్యనారాయణ స్వామి కళ్యాణం చూస్తే స్వామి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉంటాయని ఒక గొప్ప సంకల్పంతో పెద్దఎత్తున భక్తులు ప్రతి సంవత్సరం అన్నవరం వస్తూ ఉంటారు.

ఈ ఏడాది సైతం వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ఎండల రీత్యా భక్తులకు మజ్జిగ పంపిణీ పెద్ద ఎత్తున వచ్చే మీడియాకు ప్రత్యేక గేలరీ, ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కళాకారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షిస్తుందని దేవస్థాన అధికారులుతెలియచేశారు.

2024-05-04T15:08:41Z dg43tfdfdgfd