సమంత బర్త్‌డే సర్‌ప్రైజ్‌, పెళ్లిపై హీరోయిన్‌ కామెంట్స్‌‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ

Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై నోరువిప్పింది. అంతే కాకుండా మరెన్నో పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా  సమంత!

Happy Birthday Samantha Ruth Prabhu: ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా మొత్తం తన బర్త్ డే విషెస్‌తో నింపేశారు. కానీ ఎవరూ తన అప్‌కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్ మాత్రం ఆశించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమంత చేతిలో పెద్దగా సినిమాలు లేవని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఊహించని విధంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది సామ్. సమంత ఇలాంటి ఒక అప్డేట్ ఇస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో ప్రేక్షకులు సైతం ఈ పోస్టర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేసింది సమంత. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah About Qualities Of Future Husband: ‘జాతిరత్నాలు’లో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యింది ఫరియా అబ్దుల్లా. సింపుల్‌గా మన ఇంటి అమ్మాయిగా కనిపించే ఫరియా యాక్టింగ్‌కు చాలామంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా తను మాత్రం సెలక్టెడ్‌గా స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. త్వరలోనే అల్లరి నరేశ్ సరసన ఫరియా అబ్దుల్లా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిన ఫరియాకు తనకు కావాల్సిన భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే ప్రశ్న ఎదురయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నా మాజీ భార్య న‌న్ను చెంప‌మీద కొట్టింది: అమిర్‌ ఖాన్‌

Aamir Khan In The Great Indian Kapil Show : 'ది గ్రేట్ ఇండియ‌న్ కపిల్ షో. ఈ షో 'కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ‌. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను క‌పిల్ ఇంట‌ర్వ్యూ చేస్తుంటారు ఈ షోలో. ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో. అయితే, ఈ షోకి గెస్ట్ గా వ‌చ్చారు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. ఆయ‌న ఈ షోకి రావ‌డం ఇదే మొద‌టిసారి. కాగా.. ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను, జీవిత అనుభ‌వాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు అమీర్ ఖాన్. త‌న మాజీ భార్య త‌న‌ని కొట్టింద‌ని, కొరికింద‌ని ప్రెగ్నెన్సీ టైంలో ఆమె అలా చేసింద‌ని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అప్పుడు నారా లోకేష్, ఇప్పుడు పవన్ కళ్యాణ్

Tamanna Simhadri Contests Against Pawan Kalyan In Pithapuram: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా పిఠాపురంలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ ఏడాది ఎలా అయినా జనసేనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే సినీ సెలబ్రిటీలు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారానికి మద్దతునివ్వడానికి ముందుకొస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు పోటీగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన తమన్నా సింహాద్రి రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన తమన్నా.. నారా లోకేష్‌కు పోటీగా నిలబడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై పోటీకి దిగడంపై ఆమె స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

2024-04-28T11:52:07Z dg43tfdfdgfd