సలార్ 2, స్పిరిట్ కంటే ముందే ఆ సినిమానా.. ప్రభాస్ ప్లానింగ్ ఏంటో?

ప్రభాస్ ప్రస్తుతం తన స్టామినాను మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపిస్తున్నాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. కల్కి చిత్రానికి కొన్ని చోట్ల డివైడ్ టాక్ వచ్చింది. కొందరు పెదవి విరిచారు. ఇంకొంత మంది ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉన్నా కూడా రియాల్టీలో మాత్రం జనాలు కల్కికి జై కొడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా కూడా కల్కిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహాభారతం రిఫరెన్సులు ఉన్న సీన్లకు అయితే చొక్కాలు చించేసుకుంటున్నారు.

నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 555 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్, నార్త్‌ ఏరియాల్లో కలెక్షన్లు మరింతగా పుంజుకుంటున్నాయి. హాలీవుడ్ లెవెల్ స్టఫ్ అంటూ సినిమాను పొగిడేస్తున్నారు. ఈ మూవీ రెండో వారంలోకి ఎంటర్ అవ్వక ముందే 800, వెయ్యి కోట్ల వరకు రాబట్టేలా ఉంది. జూలై 12 వరకు ఈ సినిమాను ఆపడం అయితే కష్టం. ఆ తరువాత కమల్ హాసన్ ఇండియన్ 2 రంగంలోకి దిగుతుంది. ఆ మూవీకి, ఈ సినిమాకు పోటీ కాదు. కానీ కొన్ని ఏరియాల్లో అయితే థియేటర్లు తగ్గుతాయి.

ఈ వారంలో అయితే కల్కి దుమ్ములేపుతూనే ఉంటుంది. రెండో వీకెండ్‌లోనూ కల్కి జోరు సాగిస్తుంది. ఇక కల్కి ఇలా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంటే.. ప్రభాస్ మాత్రం తన లైనప్‌ను మార్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే సలార్ 2ని ప్రారంభించాల్సింది. కానీ దాని ఊసే ఎవ్వరూ ఎత్తడం లేదు. రాజా సాబ్ మెల్లిగా ట్రెండ్ అవుతోంది. స్పిరిట్ జూన్, జూలైలో స్టార్ట్ అవుతుందని అన్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు హను రాఘవపూడి ప్రాజెక్ట్ ముందుకు వస్తుందట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందట. ఆల్రెడీ సెట్స్ పనులు స్టార్ట్ అయ్యాయట. జూలై, సెప్టెంబర్ మధ్యలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందట. స్పిరిట్ అప్డేట్‌ను ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ఇవ్వాలని అనుకుంటున్నారట.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T14:05:45Z dg43tfdfdgfd