సింగరేణిలో కొత్త గనులు తీసుకొస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణిలో కొత్త గనులు తీసుకొస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి లో కొత్త గనులు తీసుకొస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా  మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఒసిపిలో పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ తరుపున  ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికులకు ఇన్క్ కం టాక్స్, సొంతింటి కల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చెస్తుందన్నారు.  రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 10వేల కోట్ల రుణ మాఫీ చేయించి తెరిపించానని చెప్పారు.  సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తదన్నారు. 

రెండు కోట్ల ఉద్యోగాలు, నల్ల ధనం వెనక్కి తీసుకొచ్చి పేద వాడి బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షలు  వేస్తామని చెప్పి బీజేపీ విస్మరించిందని ఆరోపించారు.  సింగరేణి సంస్థ సౌజన్యంతో ఈ ప్రాంతంలో సిమెంట్ ప్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు.  కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పని చేస్తే తనపై కక్ష్య కట్టి పటాన్ చెరులోని ఫ్యాక్టరీనీ మూసేశారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T03:06:34Z dg43tfdfdgfd