సిజేరియన్ కు ముందు గర్భిణులు ఏం చేయాలో తెలుసా?

కొంతమందికి నార్మల్ డెలివరీలు అయితే.. మరికొంతమందికి మాత్రం సిజేరియన్ డెలివరీలు అవుతుంటాయి. అయితే డిజేరియన్ కు ముందు గర్భిణీ స్త్రీలు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? 

 

ప్రస్తుత కాలంలో చాలా మందికి సిజేరియన్ డెలివరీలే అవుతున్నాయి. కానీ దీనివల్ల ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో.. డెలివరీ గురించి ఆడవాళ్ల మనస్సులో ఎన్నో భయాలు, ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మీకు సిజేరియన్ డెలివరీ అని డాక్టర్ చెబితే మరింత భయపడిపోతుంటారు. నార్మల్ డెలివరీతో పోలిస్తే సిజేరియన్ డెలివరీ కష్టమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తలెత్తడం మాత్రం చాలా వరకు తగ్గుతాయి. 

సిజేరియన్ డెలివరీ అనేది నిజంగా ఒక సవాలుతో కూడిన ప్రసవం. దీనిలో సిజేరియన్ తో సంబంధం ఉన్న సమస్యలను, తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి ఆడవాళ్లు సిద్దంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలను కాస్త తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?

 

మానసికంగా సిద్ధం

శస్త్రచికిత్స కోసం మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మీ గైనకాలజిస్ట్ తో మాట్లాడండి. మీ శారీరక పరీక్ష ఆధారంగా ప్రసూతి డాక్టర్ సంబంధిత సమస్యల గురించి సరైన సమాచారాన్ని ఇస్తాడు. సరైన సమాచారం మీకు అన్ని రకాల సందేహాలు, ప్రశ్నలు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

 

నిద్ర

మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. మంచి నిద్ర ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి మీరు ఉపశమనం పొందడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే శస్త్రచికిత్సకు ముందు ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయండి. ఇది మీకు మనశ్శాంతి, బలాన్ని ఇస్తుంది. అలాగే ఇది శస్త్రచికిత్స వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

 

శారీరకంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి

సీ సెక్షన్ కు ముందు మిమ్మల్ని మీరు శారీరకంగా సిద్దంగా ఉంచుకోవాలి. ఉదాహరణకు శస్త్రచికిత్స కోసం మీ కడుపు శుభ్రంగా ఉండాలి. అందుకే శస్త్రచికిత్సకు 8 గంటల ముందు ఎలాంటి ఆహారాలను తినొద్దని డాక్టర్లు చెప్తుంటారు. కాబట్టి శస్త్రచికిత్సకు ఒక రోజు ముందు మీరు మీ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినండి. 

 

శస్త్రచికిత్సకు ముందు ఆహారంతో నీళ్లు, వేరే డ్రింక్స్ ను తాగడం తగ్గించండి. శస్త్రచికిత్సకు 4 నుంచి 5 గంటల ముందు నీళ్లు తాగడం మానేయండి. మీకు మలబద్ధకం సమస్య ఉంటే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. నిజానికి శస్త్రచికిత్స సమయంలో జీర్ణక్రియ సరిగ్గా ఉండాలి. మీకు మలబద్దకం ఉంటే మీ కడుపును శుభ్రం చేయడానికి డాక్టర్ మందులను సూచించొచ్చు. డాక్టర్ ఇచ్చిన అన్ని సూచనలను సరిగ్గా పాటించండి. 

2024-05-07T08:59:09Z dg43tfdfdgfd