సిద్ధార్థ్-అదితి రావు సహా మూవీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు..

Celebrities 2nd Marriage : ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు విడాకులు ఇచ్చి రెండో వివాహాం చేసుకున్నాడు. అతని కంటే ముందు ప్రముఖ నటి దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత తోటి నటుడు జగత్ ప్రకాష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇక లేటేస్ట్‌గా సిద్ధార్థ్-అదితి రావు కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా రెండు లేదా ఎక్కువ మ్యారేజ్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు ఎవరున్నారో చూద్దాం..
Arbaaz Khan: బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు, మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ 56 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అర్బాజ్ ఖాన్ షౌరాను వివాహం చేసుకున్నాడు. శౌరా నటి కాదు మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆమె శ్రీమతి అర్బాజ్ ఖాన్. అయితే చాలా రోజులుగా వీళ్లిద్దరు సైలెంట్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.
అమలా పాల్ తాజాగా మరో పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమెను ప్రేమించిన నటుడు జగత్ దేశాయ్‌నే వివాహం చేసుకుంది.ప్రస్తుతం అమలాపాల్ గర్భంతో ఉంది. Amala Paul
మంచు మనోజ్, తన స్నేహితురాలు అలేఖ్యరెడ్డిని రెండో వివాహాంతో వివాహా బంధంలో అడుగుపెట్టాడు. వీళ్లిద్దరికి ఇది రెండో వివాహాం కావడం విశేషం.
మోహన్ బాబు | మంచు మనోజ్ మాత్రమే కాదు.. వాళ్ల నాన్న నట ప్రపూర్ణ మోహన్ బాబు కూడా తన మొదటి భార్య విద్యా దేవి కన్నుమూసిన తర్వాత.. ఆమె చెల్లెలు నిర్మల దేవిని రెండో వివాహాం చేసుకున్నారు. వీళ్లిద్దరికి  అబ్బాయి మనోజ్ ఉన్నారు. అటు మంచు లక్ష్మీ, విష్ణు మొదటి భార్య విద్యా దేవి సంతానం. (Twitter/Photo)
Naresh - Pavitra Lokesh Marriage | గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి గత కొన్నేళ్లుగా సహ జీవినం చేస్తున్నారు. అంతేకాదు అప్పట్లో ఓ హోటల్ గదిలో వీళ్లు నరేష్ మూడో భార్యకు అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక నరేష్ కూడా తన మూడో భార్యకు డ్రైవరు‌తో అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో గతేడాది మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు నరేష్ అఫీషియల్‌గా ప్రకటించారు.  (Twitter/Photo)
ప్రముఖ హీరోయిన్ దర్శకురాలు విజయ నిర్మల కుమారుడైన నరేష్.. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరోగా తన కంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు ఆల్రెడీ మూడు మ్యారేజ్‌లు జరిగాయి. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు నరేష్. వీల్లిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు న‌వీన్ విజ‌య్ కృష్ణ‌ (Naveen Vijay krishna). సెలబ్రిటీ కిడ్‌గా సినీ ఎంట్రీ ఇచ్చి రెండు, మూడు సినిమాల్లో కూడా నటించాడు న‌వీన్ విజ‌య్ కృష్ణ‌.
ఆ తర్వాత ప్ర‌ముఖ ర‌చ‌యిత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు రేఖా సుప్రియ‌ను పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ ఇద్దరికీ ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్థలు వచ్చి విడిపోయారు నరేష్. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమారుడు ఉన్నాడు. ఆమెతో మనస్పర్థల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు నరేష్. ఈమె సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సోదరి వరస అవుతోంది. తాజాగా పవిత్ర లోకేష్‌తో నాల్గో పెళ్లికి రెడీ అయ్యాడు. (Twitter/Photo)

పవిత్ర లోకేష్

పవిత్ర లోకేష్ విషయానికొస్తే. ఆమె తండ్రి మైసూర్ లోకేష్ ప్రముఖ రంగస్థల , సినీ నటుడు. ఇక  16 యేళ్ల యంగ్ ఏజ్‌లో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన పవిత్ర లోకేష్ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది ఆ తర్వాత క్యారెక్టర్స్ రోల్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ముందుగా ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత అతనితో మనస్పర్ధల కారణంగా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సుచీంద్ర ప్రసాద్ తో సహ జీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్‌కు దగ్గరైంది. లాస్ట్ ఇయర్ వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈమెకు నరేష్‌తో  మూడో పెళ్లి అవుతోంది. నరేష్‌కు నాల్గో మ్యారేజ్ అవుతోంది. మరి 2024లో వీళ్లిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటవుతారా లేదా అనేది చూడాలి. (File/Photo)
విష్ణు విశాల్ - గుత్తా జ్వాలా | కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తన లవర్ గుత్తా జ్వాలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ ఇద్దరూ అప్పట్లో ఒకంటి వారయ్యారు. (Twitter/Photo)
దియా మీర్జా | ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుంది. . (Instagram/Photo)
Singer Sunitha: టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత  2021 జనవరి 9న తేదిన. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. ఆ తర్వాాత చాలా యేళ్లకు రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది. (File/Photo)
వనిత విజయ్ కుమార్ | దేవి, రుక్మిణి లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్. ఈమె కూడా పెళ్లిళ్ల విషయంలో రికార్డు నెలకొల్పింంది. ఇక ఈమె పీటర్ పాల్ అనే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంది వనిత. కాగా ఇప్పటికే ఈమెకు రెండుసార్లు పెళ్లైంది. విడాకులు తీసుకుని మూడో పెళ్లి చేసుకుంది.  (Twitter/Photo)
దిల్ రాజు | మొదటి భార్య కన్నమూయడంతో తేజస్వినిని రెండో వివాహాం చేసుకున్న నిర్మాత దిల్ రాజు. రీసెంట్‌గా ఈ దంపతులకు ఇంట ఓ వారసుడు కూడా వచ్చాడు.  (Twitter/Photo)
సామ్రాట్ రెడ్డి  |బిగ్‌బాస్ ఫేమ్ నటుడు సామ్రాట్ రెడ్డి 2010 నవంబర్ 5న అంజనా శ్రీ లిఖితను రెండో వివాహాం చేసుకున్నాడు. హర్షిత రెడ్డిని విడాకులు ఇచ్చిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్నాడు. (Instagram/Photo)
పవన్ కళ్యాణ్ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తన తోటి నటి రేణు దేశాయ్‌ను 2008లో  రెండో పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
రెండో భార్య రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత విదేశీ యువతి అన్నా లెజ్‌నోవాను మూడో పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్. ఈమె పవన్ నటించిన ‘తీన్‌మార్’ సినిమాలో చిన్నపాత్రలో నటించడం విశేషం.(Twitter/Photo)
పవన్ కళ్యాణ్: | 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పవన్. ఆ తర్వాత ఆయన జీవితంలోకి రేణు దేశాయ్ వచ్చింది. తొలి భార్యకు విడాకులు ఇచ్చి రేణును 2008లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అన్నా లెజినీవాను పెళ్లి చేసుకున్నాడు.
నాగార్జున:  | అక్కినేని  నాగార్జున: వెంకటేష్ చెల్లెలు, రామానాయుడు కూతురు లక్ష్మితో వివాహం జరిగిన తర్వాత అనివార్య కారణాలతో నాగార్జున ఆమెతో విడిపోయాడు. ఈమె హీరో నాగ చైతన్య తల్లి. లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత అమలను ప్రేమ వివాహాం తీసుకున్న అక్కినేని నాగార్జున (Twitter/Photo)
విజయ దుర్గ: చిరంజీవి చిన్న చెల్లెలు, హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో తమ చిన్నపుడే అమ్మ విడాకులు తీసుకుందని.. అలాంటి అమ్మకు మళ్లీ తోడు కోసం పెళ్లి చేస్తే తప్పు లేదనిపించిందని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. (Twitter/Photo)
శ్రీజ | చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్‌ దేవ్‌ను రెండో వివాహాం చేసుకుంది. (Twitter/Photo)
కృష్ణ - విజయ నిర్మల | దివంగత సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా అనుమతితో తోటి నటి విజయ నిర్మలను రెండో వివాహాం చేసుకున్నారు. ఈమెకు కూడా కృష్ణ రెండో భర్త కావడం గమనార్హం. (Twitter/Photo)
కృష్ణంరాజు | దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య సీతా దేవి మరణం తర్వాత శ్యామలా దేవిని రెండో వివాహాం చేసుకున్నారు. వీళ్లకు ముగ్గురు సంతానం ఉంది. అంతకు ముందు కృష్ణంరాజు మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. (File/Photo)
నందమూరి హరికృష్ణ | జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల అమ్మ షాలినిని నిర్మాత కమ్ నటుడు హరికృష్ణ రెండో వివాహాం చేసుకున్నారు. (Twitter/Photo)
నందమూరి తారక రామారావు | ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం కన్నుమూసిన తర్వాత లక్ష్మీ పార్వతిని ప్రేమ వివాహాం చేసుకున్నారు. (Twitter/Photo)
ప్రభుదేవా| ప్రభుదేవా: 20 ఏళ్ల కిందే రమాలత్‌తో ప్రభుదేవా పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాలతో విడిపోయాడు. ఆ తర్వాత నయనతారతో పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం బెడసికొట్టింది. ఆ తర్వాత ఈ మధ్యే తనకు ఫిజియోతెరపీ చేసిన డాక్టర్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవా.
ప్రకాశ్ రాజ్ | ప్రకాశ్ రాజ్: 1994లో డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. 2009లో విడిపోయారు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు ప్రకాశ్ రాజ్.
కమల్ హాసన్ : 24 ఏళ్ల వయసులో 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకుని పదేళ్ళ తర్వాత విడాకులు ఇచ్చాడు కమల్. ఆ తర్వాత 1984 నుంచే సారికతో సహజీవనం చేసి శృతి పుట్టిన తర్వాత 1986లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో కూడా విడిపోయి గౌతమి, సిమ్రాన్ బగ్గా లాంటి హీరోయిన్స్‌తో సహజీవనం చేసాడు.
ప్రముఖ నటి సారికను కమల్ హాసన్ ఆ తర్వాత రెండో వివాహాం చేసుకున్నారు. (Twitter/Photo)
జెమినీ గణేషన్ | సావిత్రి, జెమినీ గణేషన్ రెండో వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత ఈయన మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తంగా నాలుగు పెళ్లిళ్లలతో రికార్డు క్రియేట్ చేసారు జెమిని గణేషన్ (Twitter/Photo)
ఆది నారాయణ రావు | ప్రముఖ నిర్మాత, సంగీత దర్శకుడు ఆది నారాయణ రావు.. ప్రముఖ నటి అంజలిని రెండో వివాహాం చేసుకున్నారు. (Twitter/Photo)
రాధిక  శరత్ కుమార్:  | రాధిక శరత్ కుమార్ దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను 1985లో పెళ్లి చేసుకున్న రాధిక.. ఆయనకు విడాకులు ఇచ్చి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చి కొన్నేళ్ల కిందట శరత్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది.
శరత్ కుమార్ | శరత్ కుమార్ 1984లో ఛాయను పెళ్లి చేసుకున్న శరత్ కుమార్.. ఆమెతో 2000 ఏడాదిలో విడిపోయాడు. ఆ మరుసటి ఏడాది రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు.
రాధిక - శరత్ కుమార్ | రాధికకు శరత్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది. ఇటు శరత్ కుమార్‌కు ఈమె రెండో భార్య. రాధిక అంతకు ముందు ప్రతాప్ పోతన్, రిచర్డ్ హ్యారీ తర్వాత శరత్‌ కుమార్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. (Twitter/Photo)
శరత్ బాబు | శరత్ బాబు: తనకంటే వయసులో పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు శరత్ బాబు. ఆమెతో ఎక్కువ కాలం కలిసుండలేదు. విడిపోయిన తర్వాత స్నేహలతా దీక్షిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లు కూడా కలిసి లేరు.
సైఫ్ అలీ ఖాన్‌ |  సైఫ్ అలీ ఖాన్‌ తన మొదటి భార్య అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన చాలా యేళ్ల తర్వాత కరీనా కపూర్‌ను రెండో భార్యగా చేసుకున్నాడు.  (Twitter/Photo)
కిషోర్ కుమార్ | కిషోర్ కుమార్ మధుబాలను రెండో వివాహాం చేసుకున్నారు. ఈయన కూడా మొత్తంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని రికార్డు క్రియేట్ చేసాడు. (Twitter/Photo)
ధర్మేంద్ర | హేమా మాలినిని ధర్మేంద్ర రెండో వివాహాం చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకోవడానికి మతం మారి.. మళ్లీ హిందూ మతంలోకి వచ్చారు ధర్మేంద్ర. (Twitter/Photo)
లక్ష్మి | ఒకప్పటి  సీనియర్ హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్  లక్ష్మి కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుంది.  (Twitter/Photo)
సీనియర్ దివంగత నటి జయంతి కూడా మొదట తన తోటి నటుడు దర్శకుడు పేకేటి శివరాంను ఫస్ట్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బంగారు గిరిబాబును రెండోె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకన్నా 25 ఏళ్ల చిన్నవాడైనా ప్రముఖ దర్శకుడు రాజశేఖర్‌ను వివాహాం చేసుకుంది. (actress Jayanthi)

2024-03-28T14:01:38Z dg43tfdfdgfd