సినిమా స్టార్లు VS రియల్ స్టార్లు.. ప్రజా క్షేత్రంలో గెలుపెవరిది?

ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన మరోవైపు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాల వాళ్ళను ప్రచారానికి దించుతోంది.. బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా.. ఇక మెగా కాంపౌండ్ లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటివాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్దపెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేశారు. అయితే ఇటు వైపు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు అంతా తానై జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు అయన ప్రభుత్వంలో లబ్దిపొందినవాళ్లు ఆయనకోసం ప్రచారం చేస్తున్నారు.

చదివింది 10వ తరగతి.. నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నాడు.. తిరుగులేని బిజినెస్!

తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత... అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క... జగనన్న విద్యా కనుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి... ఆసరా అనుకున్న ఓ అక్క... ఇలా పేదలే జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు.. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేనందుకు పని చేస్తున్నారు.

2024-05-09T11:40:51Z dg43tfdfdgfd