CHIRANJEEVI: సినిమాల్లోకి బలవంతంగా.. రాజకీయాల్లోకి ఇష్టంగా.. పవన్ కళ్యాణ్‌పై చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, పద్వ విభూషణుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారు. జన సేనకు ఓటు వేయండని కోరారు. తన తమ్ముడు బలవంతంగా సినిమాల్లోకి వచ్చాడని, కానీ ఇష్టంగా రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. ఎవరైనా సరే అధికారం వచ్చాక ప్రజలకు సాయం చేస్తారని, కానీ తన తమ్ముడు మాత్రం సొంత డబ్బులతో కౌలు రైతులను ఆదుకున్నాడని చెప్పుకొచ్చారు. తన తమ్ముడు లాంటి నాయకులే కదా జనాలకు కావాలని అన్నారు.

ఏ తల్లికైనా సరే తన కొడుకు కష్టపడుతుంటే బాధగా ఉంటుందని, తమ్ముడి అకారణంగా తిడుతుంటే బాధగా ఉంటుందని చిరు అన్నారు. తన తల్లి బాధ పడుతుంటే.. అమ్మకు ఒకటే మాట చెప్పారట. ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల కోసం చేస్తున్న ఈ పోరాటంలో.. మన బాధ పెద్దది కాదు అని అన్నారట. తన తమ్ముడిలాంటి నాయకులను చట్ట సభలకు పంపించాలని.. జన సేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు.

అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి.. అందరికీ మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు.. తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ది అని కొనియాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారనీ, తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని అన్నారు.

అన్యాయాన్ని ఎదురించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతోందని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు.. బలంగా నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని రాజకీయం కోసం అంకితం చేసిన శక్తిశాలి.. ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభలో ఆ గొంతు వినిపించాలి అంటూ తన తమ్ముడికి సపోర్ట్‌గా మెగాస్టార్ నిలిచారు.

పవన్ కళ్యాణ్‌ని గెలిపించండి.. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు..కలబడతాడు.. పిఠాపురం వాస్తవ్యులకు నమస్కారం, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి.. గెలిపించండి.. జై హింద్.. అని చిరంజీవి వీడియోని ముగించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T05:58:54Z dg43tfdfdgfd