సినీ నటుడు రఘుబాబు కారును ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు కారును ఓ బైకర్ ఢీకొట్టాడు. ఈదుర్ఘటనలో బైక్ పై వచ్చిన వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు. స్థానికులు సినీ నటుడి కారును చుట్టుముట్టారు. ఇంతలో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని సినీ నటుడి పొరపాటు లేదని.. బైక్ పై వచ్చిన బీఆర్ఎస్ నాయకుడే రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టినట్లుగా తేల్చడంతో నటుడితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. . ఈఘటన నల్లగొండ జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బైక్ తో రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టి చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ పట్టణ నాయకుడుగా గుర్తించారు. కారు సినీ నటుడు రఘుబాబు(సీనియర్ నటుడు గిరిబాబు తనయుడు)కొడుకు కారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో రఘుబాబు డ్రైవింగ్ పక్క సీటులో కూర్చున్నారు.

సినీ నటుడి కారును ఢీకొన్న బైక్..

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారును ఓ బైకర్ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టాడు. కారును ఢీకొట్టిన బైకర్ స్పాట్ లో చనిపోయాడు. ఈఘటన నల్లగొండ జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి నల్లగొండ టౌన్ బీఆర్ఎస్ సెక్రట్రీ జనార్ధన్ అని తేలింది. అయితే స్థానికులు రఘుబాబు కారును చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. అయితే ఈప్రమాదంలో కారు డ్రైవర్, సినీ నటుడి తప్పేమి లేదని తెలియడంతో స్థానికులు శాంతించారు.

2024-04-17T17:34:27Z dg43tfdfdgfd