సీతారాముల కల్యాణానికి వేములవాడ రెడీ

సీతారాముల కల్యాణానికి వేములవాడ రెడీ

  • భారీగా తరలివచ్చిన భక్తులు,  శివపార్వతులు, జోగినులు 
  • లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది.  సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ చైర్మన్​ గెస్ట్​ హౌస్​ ఎదురుగా కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు వేడుక ప్రారంభమవుతుందని, 11.59 గంటలకు  ముగుస్తుందని అధికారులు తెలిపారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఇప్పటికే వేలాది మంది జోగినులు, శివ పార్వతులు వేములవాడకు చేరుకున్నారు. 

ఎల్​ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎండల నుంచి ఉపశమనం కోసం వాటర్, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ​ఫస్ట్​ఎయిడ్​సెంటర్స్, అంబులెన్స్​, ఫైర్​ఇంజిన్లను రెడీగా ఉంచారు. రాముడి కల్యాణం కోసం జోగినులు తలంబ్రాలు, ముత్యాలు తీసుకువస్తారు. ఒక వైపు కల్యాణం జరుగుతుంటే మరోవైపు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని శివుడిని పెండ్లాడినట్టు తన్మయత్వం చెందడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి యేటా శ్రీరామనవమి రోజు జరిగే కల్యాణం సందర్భంగా వేల మంది శివపార్వతులుగా మారుతుంటారు.   

©️ VIL Media Pvt Ltd.

2024-04-17T02:59:21Z dg43tfdfdgfd