BRAHMANANDAM: సెట్స్ మీదకు బ్రహ్మానందం.. సుమంత్ సినిమాలో స్పెషల్ రోల్

సీనియర్ నటుడు, హాస్య బ్రహ్మా బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఎంతో నచ్చితే గానీ సినిమాలు చేయడం లేదు.. పాత్రలను ఎంచుకోవడం లేదు. చివరగా కీడా కోలా చిత్రంలో లెంగ్తీ రోల్‌ను చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమాను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్‌ మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది. సుమంత్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాయింట్‌తోనే ప్రేక్షకుల్ని పలకరిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మహేంద్రగిరి వారాహి సినిమాలోనూ ఆసక్తికరమైన కథ, కథనాలున్నాయని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ఇంపార్టెంట్ పాత్రకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ ముఖ్య పాత్రలో బ్రహ్మానందం కనిపించబోతోన్నట్టుగా చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు.

మహేంద్రగిరి వారాహి కథ, తన పాత్ర బాగా నచ్చడంతోనే బ్రహ్మానందం ఈ నిర్ణయం తీసుకున్నారని మేకర్లు తెలిపారు. త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్‌లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి తెలిపాడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. అందుకే సినిమాకు ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక సుమంత్ ఈ చిత్రం మళ్లీ తన సత్తాను చాటేలా కనిపిస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T14:51:45Z dg43tfdfdgfd